అసలు విషయం దాస్తున్న నరేష్

మా వివాదం దాదాపు బట్టబయలు అయిపోయింది. ఫండ్ రైజింగ్ హక్కులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో నరేష్ కు, జీవిత రాజశేఖర్ కు మధ్య స్టార్ట్ అయిన విబేధాలు అలా అలా వేరే వేరే టర్న్ లు తీసుకున్నాయి అన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం. ఇలాంటి నేపథ్యంలో రెండువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.

ఏడాదికి ఒకసారే జనరల్ బాడీ నిర్వహించాలని, బైలా మార్చాల్సిన అవసరం ఏమిటి అంటూ మా ప్రెసిడెంట్ నరేష్ చాలా తెలివిగా అసలు విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. చిరంజీవి పెట్టిన రూల్స్ మార్చడం ఏమిటి అంటూ, విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

రూల్స్ చిరంజీవి పెట్టలేదు. సంఘం ఏర్పాటు చేసినపుడు ఓ బైలా అంటూ ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు తొలి అధ్యక్షుడిగా చిరంజీవి వున్నారు. కానీ నరేష్ కావాలని తెలివిగా, చిరంజీవి పెట్టిన బైలా అంటూ వెరైటీగా మాట్లాడుతున్నారు. మొత్తంమీద చూస్తుంటే నరేష్ ఈ విషయంలో దాదాపు పూర్తిగా కార్నర్ అయినట్లు కనిపిస్తోంది.

ఆయన పెద్ద హీరోల సహకారంతో ఈ సమస్య నుంచి గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తున్నట్లు బోగట్టా. అయితే గెలిచిన తరువాత పలు సందర్భాల్లో నరేష్ బాహాటంగానే ఆటిట్యూడ్ చూపించడం, కోటా శ్రీనివాసరావు వంటి సీనియర్ల విషయంలో స్టేజ్ మీదే ఆయన ప్రవర్తించిన తీరు, సమావేశాలు, నిర్ణయాల విషయంలో నరేష్ వ్యవహారశైలి వంటివి దృష్టిలో పెట్టుకుని, ఆ పెద్ద హీరోలు కూడా ఇప్పుడు సైలంట్ అయినట్లు తెలుస్తోంది.

అయితే మా అధ్యక్షుడిని పదవీకాలం మధ్యలోనే దించేసారు అనే కళంకం రాకూడదని పెద్ద హీరోలు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అదే అనివార్యంగా మార్చాలని జీవిత రాజశేఖర్ వర్గం పట్టుగా వున్నట్లు తెలుస్తోంది.

Show comments