తమిళ అర్జున్ రెడ్డి పేరు మారింది, పెదవి విరుపులు!

ఆల్రెడీ బాల వంటి పెద్ద డైరెక్టర్ చాలావరకూ పూర్తిచేసిన ‘వర్మ’ను పూర్తిగా పక్కన పెట్టేసి.. అర్జున్ రెడ్డి రీమేక్ ను మళ్లీ రూపొందించే పనిలో పడ్డారు విక్రమ్ అండ్ కో. తనయుడు ధ్రువ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న విక్రమ్ తన సన్నిహిత దర్శకుడ బాల ఇచ్చిన ఔట్ పుట్ మీద నమ్మకాన్ని ఉంచలేకపోయాడు.

ట్రైలర్ గా వచ్చినప్పుడు తీవ్రంగా ట్రోల్ కు గురిఅయ్యింది అర్జున్ రెడ్డి తమిళ రీమేక్. తెలుగులో పండిన ఎమోషన్స్ అన్నీ కామెడీగా మారిపోయినట్టుగా ఉన్నాయనే టాక్ అప్పుడే స్ప్రెడ్ అయ్యింది. అది కేవలం క్రిటిక్స్ కామెంట్ మాత్రమేకాదు.. రూపకర్తలకు కూడా అదే అనిపించింది. దీంతో బాలను తప్పించేశారు.

సినిమా షూటింగును మళ్లీ మొదలుపెట్టారు. ఈసారి హీరోయిన్ ను కూడా మార్చేశారు. అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో తమిళ వెర్షన్ ను మొదలుపెట్టారు. ఈసారి ‘ఆదిత్య వర్మ’ పేరుతో సినిమా స్టార్ట్ అయ్యింది.

అందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది. ఈసారి టైటిల్ లోగోను పూర్తిగా తెలుగు వెర్షన్ స్టైల్లోనే తయారు చేశారు. ధ్రువ్ ను అర్జున్ రెడ్డి లుక్ లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈసారి కూడా కొన్ని పెదవి విరుపులు తప్పడంలేదు.

ఎలాచూసినా.. తెలుగు వెర్షన్ లో విజయ్ దేవరకొండ లుక్ లో కనిపించిన ఎమోషన్ ఈ కొత్త పోస్టర్లో కూడా కనిపించడం లేదని క్రిటిక్స్ అంటున్నారు. మరి ఈసారి ఈ సినిమా ఎలా సాగుతుందో!

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?