త్రివిక్రమ్ అంతే.. మనసులో ఫిక్స్ అయ్యాడంతే!

ఓ వైపు రిలీజ్ డేట్ ముంచుకొస్తోంది. మరోవైపు ప్రమోషన్ ఊపందుకోవాల్సిన టైం వచ్చింది. ఇంకోవైపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లో ఉంది. షూటింగ్ కు టైం సరిపోవట్లేదంటూ కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఫారిన్ షెడ్యూల్స్ పెట్టుకోవడమంటే టైమ్ వేస్ట్ చేసుకోవడమే. ప్రస్తుతం అరవింద సమేత యూనిట్ అదే పని చేస్తోంది.

ఒక్కపాట కోసం యూనిట్ ఇటలీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. రేపోమాపో యూరోప్ కు బయల్దేరుతున్నారు. తారక్, పూజాహెగ్డే మధ్య సాంగ్ తీస్తారట. నిజానికి టైమ్ లేకపోవడంతో ఫారిన్ షెడ్యూల్స్ అన్నీ కాన్సిల్ చేస్తున్నట్టు గతంలో హారిక-హాసిని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు సడెన్ గా ఇటలీ టూర్ తెరపైకి వచ్చింది. దీనికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తోంది.

హారిక-హాసినిలో త్రివిక్రమ్ ఎంత చెబితే అంత. ఈ విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఈసారి కూడా ఈ షెడ్యూల్ విషయంలో త్రివిక్రమ్ మాటే చెల్లింది. అన్నీ తను చూసుకుంటానని, ఫారిన్ షెడ్యూల్ ఫిక్స్ చేయమని త్రివిక్రమ్ చెప్పడంతోనే నిర్మాతలు రంగంలోకి దిగారట. 

సినిమా విడుదలకు అటుఇటుగా 3 వారాలు మాత్రమే టైమ్ ఉంది. అందులో వారం రోజులు ఈ షెడ్యూల్ కే పోతుంది. మిగతా 2 వారాల్లో ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్.. ఇలా అన్నీ పూర్తవ్వాలి. త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి.

Show comments