అరవింద తొలి రోజు కుమ్మేసిందిగా

అనుకున్నట్లే అరవింత సమేత వీరరాఘవ సినిమా తొలిరోజు వసూళ్లు బీభత్సంగా వున్నాయి. అనుకున్నట్లే తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 26 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే దాదాపు ఆల్ టైమ్ రికార్డుల్లో రెండో ప్లేస్ కు చేరినట్లే. చాలాచోట్ల నాన్ బాహుబలి రికార్డు సాధించింది. 90 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా మార్కెట్ చేసిన అరవింద తొలిరోజు వసూళ్లు పూర్తి ఆశాజనకంగా వున్నాయి.

ఇదే ఊపు కంటిన్యూ అయితే ఫస్ట్ వీక్ కు బ్రేక్ ఈవెన్ అయిపోయే చాన్స్ వుంది. అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వుండడం, సోషల్ మీడియాలో కూడా మాంచి బజ్ రావడంతో కలెక్షన్లు స్టడీగానే వుంటాయని అంచనా వేస్తున్నారు.

తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి

నైజాం...5.60 (షేర్)
ఉత్తరాంధ్ర....3.05(షేర్)
సీడెడ్........6.45 (గ్రాస్)
కృష్ణా...1.60 (షేర్)
గుంటూరు...4.64(షేర్)
వెస్ట్....2.02 (షేర్)
ఈస్ట్....2.77 (షేర్)
నెల్లూరు...1.06(షేర్)
నార్త్ ఇండియా 20లక్షలు(షేర్)
ఒరిస్సా 12.50 లక్షలు(షేర్)
తమిళనాడు... 25 లక్షలు(షేర్)

Show comments