గట్టిగా అడిగితే ఇంకేం చూపించేస్తుందో.!

మొన్నామధ్యన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొనే, 'నేను అమ్మాయిని.. నాకు వక్షోజాలు వుంటాయి..' అంటూ ఘాటైన సమాధానమిచ్చి అందర్నీ విస్మయానికి గురిచేసింది. విచ్చలవిడి అందాల ప్రదర్శనపై విమర్శలు వచ్చినవేళ, దీపిక ఆ స్థాయిలో సమాధానమిచ్చింది. అయితే, ఆమె సమాధానం మరింత వివాదాస్పదమయ్యిందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా, తన 'థైస్‌'ని (తొడలు) ప్రదర్శనకు పెట్టింది. జర్మనీ పర్యటనలో వున్న ప్రధాని నరేంద్రమోడీతో ప్రియాంకా చోప్రా భేటీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రియాంకా చోప్రా మోకాళ్ళు కన్పించేలా డ్రెస్సింగ్‌ చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. పైగా, దేశ ప్రధాని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవడమేంటని నెటిజన్ల నుంచి ప్రశ్నలు ముంచెత్తాయి. దాంతో ప్రియాంకకి ఒళ్ళు మండిపోయింది.

నిజానికి, హీరోయిన్లకు ఇదంతా మామూలే. బికినీల్లోనూ, అవసరమైతే సెమీ న్యూడ్‌ పాత్రల్లోనూ కన్పించేందుకు వెనుకాడరు అందాల భామలు. అయినాసరే, పబ్లిక్‌లోకి వచ్చేటప్పుడు కాస్తంత 'డిగ్నిటీ' అవసరం కదా.! అలా ప్రశ్నిస్తే, 'డ్రెస్‌ కోడ్‌ మహిళలకేనా.?' అని మహిళా సంఘాలు ఎదురు ప్రశ్నిస్తాయనుకోండి.. అది వేరే విషయం.

ఇక, తన తొడల ప్రదర్శనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రియాంక తన తల్లితో వున్న పొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'ఆ తొడలు జీన్స్‌ పరంగా వచ్చాయి..' అంటూ కౌంటర్‌ ఇచ్చానని ప్రియాంక అనుకుందిగానీ, ఇక్కడ తన స్థాయిని ఆమె పూర్తిగా తగ్గించేసుకుందన్నది నిర్వివాదాంశం.

సోషల్‌ మీడియాలో సవాలక్ష కామెంట్లు వస్తాయి.. వాటన్నిటినీ పట్టించుకుని, ఇంకా ఇంకా చూపించేయాలనుకోవడం హాస్యాస్పదమే. గట్టిగా ప్రశ్నిస్తే, ప్రియాంక ఇంకేం చూపించేస్తుందోనని నెటిజన్లు మరింత ఘాటుగా కామెంట్లేస్తున్నారు. నిజమే మరి, 'జీన్స్‌' పేరుతో ప్రియాంక చూపించకూడనివి చూపించేసినా చూపించెయ్యొచ్చు.!

ఎంతైనా హాలీవుడ్‌కి వెళ్ళింది కదా.. ఆ మాత్రం 'జోరు' వుంటుంది లెండి.

Show comments