ఏపీ అసెంబ్లీ.. అంతా కొత్త కొత్తగా!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈరోజు నుంచి శాసనసభ సమావేశాలు మొదలు కాబోతూ ఉన్నాయి. ఐదురోజుల పాటు సాగే సమావేశాలు బుధవారంతో మొదలు అవుతున్నాయి. ప్రభుత్వం మారడంతో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అంతా కొత్త కొత్తగా కనిపించనుంది.

ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కూర్చోబోతున్నారు. అసెంబ్లీలో ఈ కాంబినేషన్ ఇదివరకూ రివర్స్ లో ఉండేది. అప్పుడు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీకి జగన్ మోహన్ రెడ్డి అధినేతగా వ్యవహరించారు. ఇప్పుడు అంతకన్నా కీలకమైన పొజిషన్లో జగన్ మోహన్ రెడ్డి కూర్చుంటున్నారు.

కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలున్న పార్టీ తరఫు నేతగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చుకుంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సీఎం సీటును సొంతం చేసుకుని చంద్రబాబును మళ్లీ ప్రతిపక్ష వాసానికి పంపించారు.

గతంలో పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగిన చంద్రబాబు నాయుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ పొజిషన్ కు వచ్చారు. ఈ  మార్పు మాత్రమే కాకుండా.. ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి మరెన్నో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తొలి సమావేశాల్లో సభ ఐదురోజుల పాటు సమావేశం అవుతుంది. 

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?