అనుష్క అంటే నాగార్జునకు ఎందుకంత ఇష్టం

ఎవరు అవకాశం ఇచ్చినా, ఇవ్వకపోయినా అనుష్కకు ఛాన్స్ ఇవ్వడానికి నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. బొమ్మాలి అంటే మన్మధుడికి అంత ఇష్టం. ఆమె బొద్దుగా ఉన్నప్పుడే ఎంతో ముద్దుగా పిలిచిమరీ అవకాశాలిచ్చాడు. అలాంటిదిప్పుడు అనుష్క స్లిమ్ అయితే ఊరుకుంటాడా. వెంటనే మరో సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అవును.. నాగ్-స్వీటీ కాంబినేషన్ మరోసారి సెట్ అయింది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు నాగార్జున. మన్మధుడు-2 పేరుతో రాబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేశారట. నాగ్ అడిగితే అనుష్క నో చెప్పే ఛాన్సేలేదు. సో.. దాదాపు ఇది ఫిక్స్.

అనుష్కను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి నాగ్. అప్పట్నుంచి వాళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. నాగ్ ఎప్పుడు కోరినా కాల్షీట్లు ఇవ్వడానికి వెనకాడలేదు అనుష్క. చివరికి నాగ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది. అలా అనుష్కను సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటాడు నాగ్. తనకు బ్రేక్ ఇచ్చిన నాగ్ పై అనుష్క తన అభిమానాన్ని అలా ప్రదర్శిస్తుంటుంది.

ఎవరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అనుష్కకు నాగ్ నుంచి ఎప్పుడూ ఓపెన్ ఆఫర్ ఉంటుందనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే జరిగింది. స్లిమ్ అయిన వెంటనే సినిమా ఛాన్స్ ఇచ్చాడు నాగ్. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మాధవన్ తో నిశ్శబ్దం అనే సినిమా చేస్తోంది.

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు