అంత భయమేంటి? హీరో?

హీరో అంటే హీరోలా వుండాలి. ప్రతి చిన్న దానికీ గాభరా పడిపోకూడదు. కిందా మీదా అయిపోకూడదు. కానీ టాలీవుడ్ లో ఓ హీరో వ్యవహారం దానికి రివర్స్ లో వుంది. ప్రతి చిన్నదానికీ కిందా మీదా అయిపోతాడు. వాళ్లకి వీళ్లికి ఫోన్ చేసి, మెసేజ్ లు పెట్టి బయటపడిపోతాడు.

ఈ హీరో చేసిన ఓ మంచి సినిమా విడుదల లేటవుతూ వస్తోంది. ఆ మాటకు వస్తే సినిమా నిర్మాణం కూడా లేటే అయింది. ఈ హీరో స్క్రిప్ట్ లో వేళ్లు పెట్టి, రైటర్ ను మార్చి మళ్లీ స్క్రిప్ట్ రాయించి, ఇలా టోటల్ గా సినిమా లేటయింది.

తీరా విడుదలకు వచ్చేసరికి సవాలక్ష సమస్యలు చుట్టు ముట్టాయి. ఇక విడుదలే అవ్వదు అనేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏదో మంచి రోజులు వచ్చి విడుదలకు రెడీ అవుతోంది.  ముందుగా అది జనాలకు ఎలా రీచ్ అవుతుందో అది చూడాలి. ఆ మేరకు ప్రచారం చేయాలి.

కానీ ఈ హీరో అదే రోజు విడుదలవుతున్న ఓ చిన్న సినిమా గురించి ఎక్కువ కలవరపడుతున్నట్లు బోగట్టా. ఆ చిన్న సినిమాలో అంతా కొత్తవాళ్లే, అంతా కొత్త వ్యవహారమే. కానీ మన హీరో ఆ సినిమా పోటీకే కిందా మీదా అయిపోతూ, వాళ్లకే ఫోన్ చేసి, వాయిదా వేసుకోవచ్చుగా అని అడిగినట్లు బోగట్టా. 

ఈ సంగతి ఆ నోటా  ఈ నోటా ఇండస్ట్రీలో పాకడం ప్రారంభించింది. దీంతో ఆ మేరకు గుసగుసలు ప్రారంభమయ్యాయి. హీరో వెళ్లి వెళ్లి ఇలా  నేరుగా ఓ చిన్న సినిమా వాయిదా కోసం ప్రయత్నించడం ఏమిటో?  అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Show comments