అంతరిక్షం ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్

అంతరిక్షం సినిమా కచ్చితంగా ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హీరో వరుణ్ తేజ్ అన్నారు.

అంతరిక్షం సినిమా విడుదల సందర్భంగా ఆయన 'గ్రేట్ ఆంధ్ర'తో ముచ్చటించారు. అంతరిక్షం సినిమా తెలుగుసినిమాకు అతీతంగా వుంటుందని, వరుణ్ ఈ సందర్భంగా అన్నారు.

సంకల్ప్ జస్ట్ సినాప్సిస్ చెప్పాడని, కచ్చితంగా ఓ వైవిధ్యమైన ప్రయత్నం అవుతుందని, వెంటనే ఓకె చెప్పానని అన్నారు.

శ్రీనువైట్ల, పూరి జగన్నాధ్ మంచి దర్శకులని, మంచి హిట్ లు ఇచ్చిన వారని, తనతో చేసిన సినిమాల విషయంలో మాత్రం కథల్లో తేడా వచ్చిందనే అనుకుంటానని వరుణ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సీనియర్లు కావడంతో తాను తన పాత్ర వరకే చూసుకున్నానని, అదే తొలి ప్రేమ సినిమా విషయంలో మాత్రం కొత్త దర్శకుడు కావడంతో కాస్త దగ్గర వుండి జాగ్రత్తలు తీసుకున్నానని అన్నారు.

హ్యాట్రిక్ విజయం లభిస్తుందా? అని ప్రశ్నించగా, ఇలాంటివి అస్సలు మైండ్ లోకి తీసుకోనని, సినిమా సక్సెస్ సంగతి కన్నా, ఓ విభిన్నమైన సినిమా చేసానన్న విషయం మాత్రం పరిగణనలోకి తీసుకుంటానని అన్నారు.

సినిమా కథల ఎంపిక విషయంలో పూర్తి నిర్ణయం తనదే అని, తన తండ్రి నాగబాబు కలుగచేసుకోరని అన్నారు. తనకు డౌట్ వస్తేనే తండ్రిని సంప్రదిస్తా అన్నారు. అంతరిక్షం సినిమా కథేంటీ తన తండ్రికి ఇప్పటికీ తెలియదని వివరించారు.

ఎప్ 2 సినిమా చేయడం భలే హ్యాపీగా వుందని, వెంకటేష్ తో పనిచేయడం భలే మంచి ఎక్స్ పీరియన్స్ అని అన్నారు. ఆయన తనకు ఓ ఫ్రెండ్ లా మారిపోయారన్నారు. అటు రాజేంద్ర ప్రసాద్, ఇటు వెంకటేష్ ల లాంటి ఉద్దండుల మధ్య పనిచేయడం కాస్త టెన్షన్ పెట్టినా, మంచి అనుభవం మిగిల్చిందన్నారు. అనిల్ రావిపూడి సహకారంతో తెలంగాణ యాస బాగానే నేర్చుకున్నా అన్నారు. 

ఎఫ్ 2 సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ప్యాకేజ్ గా వుంటుందని, ఆ సినిమా తరువాత కొత్త దర్శకుడితో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా ఓకె చేసానని అన్నారు.

హరీష్ శంకర్ తమిళ రీమేక్ ఐఢియాతో వచ్చారని, తమిళ సినిమా అన్నాక, తెలుగు కోసం చాలా మార్చాల్సి వుంటుందని, అవన్నీ డిస్కస్ చేసామని, ఆ స్క్రిప్ట్ రెడీ కావాల్సివుందని వరుణ్ చెప్పారు.

డైరెక్టర్ హీరోను ఇంటర్వ్యూ చేస్తే... అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూడండి 

కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments