లాంఛనం పూర్తి చేసిన టీడీపీ ఎంపీ

తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఈ బాటలో నడవగా.. నేడు మరో ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  తీర్థం పుచ్చుకున్నారు.  ఆయనే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు.

ఈయన తెలుగుదేశం పార్టీని వీడవచ్చని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి, ఆ మేరకు ఇప్పుడు రవీంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునున్నారు. జగన్ తో సమావేశమై ఆయన వైసీపీలోకి చేరారు.

పండుల రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీని వీడటానికి  కారణాలను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇలా చెబుతోంది... వచ్చే ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నారని, అయితే చంద్రబాబు నాయుడు ఎంపీగానే పోటీచేయాలని అంటున్నారని.. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా చెబుతోంది.

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని వరసగా నేతలు వీడుతూ ఉండటంతో.. వాళ్లు వీడుతున్న కారణాలను  వేరేరకంగా చూపుతూ.. డ్యామేజ్ కవరేజ్ చేసేందుకు తెలుగుదేశం అనుకూల మీడియా ప్రయాస పడుతూ ఉంది.

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు