అక్షయ్ కుమార్, ప్రభాస్… మోడీ ఇంకో బయోపిక్!

మోడీపై మరో బయోపిక్ వస్తోంది. ఇప్పటికే మోడీ జీవితకథ ఆధారంగా కొన్ని సినిమాలు ప్రతిపాదనలోకి వచ్చాయి. వాటిల్లో ఒకటి విడుదల అయ్యింది కూడా. మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించిన ఆ సినిమా ఎన్నికల సమయంలో విడుదల అయినట్టుంది. అయితే ఆ సినిమా ప్రేక్షకుల్లో ఏ రకంగానూ ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. పైపెచ్చూ విమర్శలపాలయ్యింది.

మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ లుక్కే ఎవరికీ నచ్చినట్టుగా లేదు. ఎన్నికల్లో అయితే మోడీ మళ్లీ నెగ్గారు కానీ, ఆ బయోపిక్ మాత్రం గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా మోడీ జీవిత కథ ఆధారంగా వస్తోందట. దీని పేరు 'మన్ బైరాగి'. సంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం గమనార్హం.

బాలీవుడ్ లో భారీ సినిమాకు కేరాఫ్ భన్సాలీ. అలాంటి ప్రొడ్యూసర్ పేరు ఈ సినిమా విషయంలో వినిపిస్తుండటంతో.. ఇది కూడా భారీగానే ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లుక్ ను విడుదల చేశారు. ఆ లుక్ లో బాల నరేంద్రమోడీ పాత్రధారి కనిపిస్తున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇద్దరు హీరోలు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్టుచేశారు. వారే అక్షయ్ కుమార్, ప్రభాస్. ఈ ఇద్దరు హీరోల అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోడీ బయోపిక్ ను సోషల్ మీడియాలోకి వదిలారు.

అక్షయ్ కుమార్ కొన్నేళ్లుగా బీజేపీకి అతి సన్నిహితుడుగా మెలుగుతున్నారు. ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నేత అని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే ఈ హీరోల ఖాతాల నుంచి మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల అయినట్టుంది.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ

Show comments