అన్నీ వదిలేసిన లగడపాటి

మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్. జనాల తీర్పు ఏమిటన్నది తెలుస్తుంది. తెలుగదేశం కావచ్చు, వైకాపా కావచ్చు, ఏదో ఒకటి అధికారం చేపడుతుంది. ఇలాంటి టైమ్ లో లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం అంటే ఏమనుకోవాలి? 

'నాకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదు. రాజకీయాలతో సంబంధం లేదు..' ఇవీ రాజగోపాల్ చెప్పిన మాటలు. రాజకీయాలతో, పార్టీలతో సంబంధం లేకపోతే మరి ఆ మాటలెందుకు?

'రాజధానికి భూములు ఇచ్చిన రైతులు దిగులు పడక్కరలేదు'  ఏమిటీ మాట? దేనికి దిగులు పడాలి అసలు? ఇప్పుడు ఎందుకు పడక్కరలేదు? జగన్ వస్తే రాజధాని మార్చేస్తానని ఏమన్నా చెప్పాడా? లేదా రాజధాని కట్టడం మానేస్తానని అన్నాడా? మరి రాజధానికి బలవంతగా భూములు లాక్కున్నారని గోల పెడుతున్న రైతుల సంగతి ఏం మాట్లాడతారు?లగడపాటి?

'లోటు బడ్జెట్ కాబట్టి సైకిల్ కోరుకున్నారు' ఆంధ్రకు లోటు బడ్జెట్ అంటే ఎవరన్నా ఏమంటారు? ఇష్టం వచ్చినట్లు ప్రజల/ప్రభుత్వం సొమ్ము, అలాగే అందినకాడికి అప్పులు చేసి మరీ జనాలకు పంచేసారు. వేలకు వేలు. పసుపుకుంకుమ, ఇంకా ఇంకా రకరకాల పేర్లు చెప్పి ఓట్ల కోసం జల్లేసారు. మరి లోటు బడ్జెట్ అంటే ఎవరన్నా నమ్ముతారా?

ఎన్నికల నిబందనల ప్రకారం 18న ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదు. మరి లగడపాటి చేసింది ఏమిటి? ఎవరు గెలుస్తారో, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేదు కానీ,  ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పారు కదా? ఇది ఎంత వరకు నైతికం?

Show comments