అనిల్ రావిపూడి రెడీ

మహేష్ బాబు 26వ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ అయిపోయారు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి, త్వరలో షూటింగ్ కు రెడీ అంటూ ట్విట్టర్ లో సంకేతాలు వదిలారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కీలక కాస్టింగ్ రెడీ అయిపోయింది. విజయశాంతి, జగపతి బాబు లాంటి వాళ్లను ఇప్పటికే ఫిక్స్ చేసారు. రష్మిక మడోన్న హీరోయిన్ గా ముందే ఫిక్స్ అయింది.

అనిల్ రావిపూడి-మహేష్ బాబు సినిమాను అనిల్ సుంకర-దిల్ రాజు కలిపి నిర్మిస్తారు. ప్రొడక్షన్ అనిల్ సుంకర, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు కలిసి చూసుకుంటారని తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ సినిమా ముహుర్తం రోజునే సినిమా విడుదల డేట్ ను ప్రకటించబోతున్నారు.

సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. బోగి రోజు కానీ, ఆ రోజుకు ఒకరోజు ముందు వెనుకగా గానీ విడుదల డేట్ వుంటుంది. సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నందున, ముందుగానే విడుదల డేట్ ప్రకటించి, క్లారిటీ ఇచ్చేయాలన్నది దిల్ రాజు వ్యూహాంగా వుంది.

వచ్చే నెలలో షూట్ ప్రారంభించినా, మహేష్ బాబు కాస్త ఆలస్యంగా జాయిన్ అవుతారని టాక్. 

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు