అనసూయ క్యారెక్టర్ ఏమిటి?

అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా చేస్తూ వస్తూ, తన కంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ. రంగస్థలం నుంచి ఆమెకు చాన్స్ లు బాగానే వస్తున్నాయి. లేటెస్ట్ గా యాత్ర సినిమాలో కూడా అనసూయ కోసం డైరక్టర్ మహి ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ను తయారుచేసారు.

అయితే సినిమా వైఎస్ బయోపిక్ నే కానీ, అనసూయ ది మాత్రం రియల్ క్యారెక్టర్ కాదు. వైఎస్ జీవతంలో తారసపడే రెండు మూడు క్యారెక్టర్లు తీసుకుని వాటిని క్లబ్ చేసి, ఓ ప్రత్యేకమైన ఫిక్షన్ క్యారెక్టర్ తయారుచేసారట. ఆ క్యారెక్టర్ ను అనసూయ చేస్తోంది. 

ఈ క్యారెక్టర్ లో లైవ్ క్యారెక్టర్ల షేడ్ లు ఒకటికాదు, రెండుమూడు కనిపిస్తాయట. సినిమాలో ఇదే టెక్నిక్ వాడారట. లైవ్ క్యారెక్టర్లు చూపించుకుంటూపోతే, చాలా క్యారెక్టర్లు ప్రవేశపెట్టాల్సి వస్తుంది, మరీ డాక్యుమెంటరీలా తయారలవుతుందని, ఒకేతరహా ఎసెన్స్ వున్న క్యారెక్టర్లు రెండు మూడు తీసుకుని, వాటిని ప్రతిబింబించే సింగిల్ క్యారెక్టర్ ను తయారుచేసే ఈ టెక్నిక్ బాగా వచ్చిందని వినికిడి.

యాత్ర సినిమా ఫిబ్రవరి 8న విడుదలకు రెడీ అవుతోంది. 

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!