అనంత.. టీడీపీలో బీసీలకు దక్కింది బూడిదే!

అనంతపురం జిల్లాలో మెజారిటీ జనాభా బీసీలది. సామాజికవర్గాల వారీగా చూసుకుంటే.. కురుబ, బోయ సామాజికవర్గాల జనాభా గణనీయంగా ఉంటుంది. వాటితో పాటు పద్మశాలీ(నేత), బలిజలు (వీరిలో కొందరు బీసీలు-కొందరు ఓసీలు) భారీగా ఉంటారు. ఒక్కొక్క కులం వారీగా బీసీలను తీసుకున్నప్పుడు రెడ్ల జనాభా కూడా గణనీయంగా ఉంటుంది. ఎటొచ్చీ కమ్మవాళ్ల జనాభానే ఏ కుల జనాభాకూ తగిన స్థాయిలో ఉండదు!

ఇదీ అనంతపురం జిల్లా సామాజికవర్గాల లెక్క. ఇక ఇప్పుడు టికెట్ల కేటాయింపులను పరిశీలిస్తే.. యథావిధిగా తెలుగుదేశం పార్టీలో కమ్మవాళ్ల ఆధిపత్యం స్పష్టం అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి బీసీలకు గట్టి ప్రాధాన్యం ఇస్తూ ఉండగా.. తెలుగుదేశం పార్టీలో కమ్మదనం మరింతగా పెరుగుతూ పోతోంది!

-అనంతపురం ఎంపీ, హిందూపురం ఎంపీ.. ఈ రెండు సీట్లనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించింది.

-జిల్లాలో బోయల జనాభా భారీగా ఉంది. అనంతపురం ఎంపీ టికెట్ ను బోయ తలారి రంగయ్యకు కేటాయించారు వైఎస్ జగన్.

-బోయలకు ధీటుగా కురుబల జనాభా ఉంటుంది. ఆ వర్గానికి ప్రాధాన్యతను ఇస్తూ.. హిందూపురం ఎంపీ సీటును కురుబలకు కేటాయించారు జగన్. ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశమే. ఎందుకంటే.. కాంగ్రెస్ రోజుల్లో ఎప్పుడూ ఈ రకంగా రెండు ఎంపీ సీట్లనూ బీసీలకు కేటాయించిన సందర్భాలు లేవు.

-తెలుగుదేశం పార్టీ గతంలో రెండు ఎంపీ సీట్లనూ బీసీలకు ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశంలో బీసీలకు ప్రాతినిధ్యం పూర్తిగా జీరో అయిపోతోంది.

-ఏకంగా ఆరుమంది కమ్మోళ్లకు మళ్లీ టికెట్లు దక్కాయి. అనంతపురం అర్బన్, కల్యాణదుర్గం, రాప్తాడు, ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల నుంచి కమ్మోళ్లు పోటీచేస్తూ ఉన్నారు. జిల్లాలో వారి జనాభా శాతంతో నాలుగైదుకు మించదు. అలాంటి చోట దాదాపుగా సగం టికెట్లను కేటాయించారంటే కమ్మదనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

-ఎస్సీ రిజర్వడ్ సీట్లు రెండుపోగా.. మిగిలిన పన్నెండు సీట్లలో ఆరుసీట్లు కమ్మోళ్లకు దక్కాయి. అంటే యాభైశాతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల విషయంలో రెడ్లకు ప్రాధాన్యత దక్కింది నిజమే. అయితే వారి జనాభా శాతం అనంతపురంలో గణనీయంగా ఉంటుంది. అయినా రెండు ఎంపీ సీట్లనూ బీసీలకు కేటాయించడం ద్వారా జగన్ సామాజికవర్గ న్యాయం చేయగలిగారు. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా గట్టిగా ఉండబోతోంది.

-ఇక జిల్లాలో ముస్లిం మైనారిటీల జనాభా కూడా గట్టిగా ఉంటుంది. అనంతపురం అర్బన్, హిందూపురం, కదిరి అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లింల జనాభా చెప్పుకోదగిన రీతిలో ఉంది. అయితే టీడీపీ ఒక్క ముస్లింకి కూడా టికెట్ ఇవ్వలేదు! గత ఎన్నికల్లో జగన్ కదిరిలో చాంద్ భాషాకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే, అతడిని టీడీపీ తనవైపుకు తిప్పుకుని ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి హిందూపురం ఎమ్మెల్యే టికెట్ ను ముస్లిం అభ్యర్థికి కేటాయించింది.

-అనంతపురం విషయమే ప్రత్యేక ప్రస్తావన ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారం సాధించుకుందంటే అందులో అనంతపురం హస్తం చాలా ఉంది. పద్నాలుగు సీట్లలో పన్నెండు చోట్ల టీడీపీని గెలిపించి రాష్ట్ర స్థాయిలో నిలబెట్టింది అనంతపురం. అలాంటి చోట్ల చంద్రబాబు నాయుడు ఇప్పుడు టికెట్లు కేటాయించిన తీరు. జగన్ అనుసరించిన వ్యూహం.. మొత్తం ఫలితాలను మార్చేసేలా ఉంది!

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?