ఆ హాట్ సాంగ్స్ గర్వకారణమన్న మాజీ హీరోయిన్

అంబిక.. తెలుగునాట ఈమెకు కేరెక్టర్ ఆర్టిస్ట్ తరహా గుర్తింపే ఎక్కువ. హీరోయిన్ గా కూడా చేసింది కానీ.. నటి రాధకు అక్కగానే ఎక్కువ గుర్తింపు ఉంది అంబికకు. తెలుగులో ఇలా అయినా.. తమిళంలో మాత్రం అంబిక బోలెడన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అక్కడ స్టార్ హీరోల సరసన నటించింది.

ప్రత్యేకించి కమల్ తో ఈమెది హిట్ పెయిర్. తెలుగులో దాసరి నారాయణరావు సినిమాల్లో కనిపించింది అంబిక. అంబిక చీరకట్టు హీరోయిన్ కావడంతోనేమో మనోళ్లు పెద్దగా ఛాన్సులు ఇవ్వలేదు. మరి అదే చీరకట్టులో కూడా గ్లామర్ ను ఒక రేంజ్ లో ఒలికించింది ఈ ఎనభైల హీరోయిన్.

కమల్ హాసన్, కార్తిక్ వంటి తమిళ హీరోలతో చీరకట్టులో చాలా సెక్సీ మూవ్స్ లో నర్తించింది అంబిక. ఆ సినిమాలు ఎలాగూ తెలుగులోకి అనువాదం  అయ్యాయి. ఆ సినిమాల్లోని పాటలను ఇప్పటికీ తెలుగు, తమిళ టీవీ చానళ్లు రాత్రి పదకొండు తర్వాత ప్రసారం చేస్తూ ఉంటాయి.

మిడ్ నైట్ సాంగ్స్ లో అవి ప్రసారం అవుతూ ఉంటాయి. అంత రొమాంటిక్ గా ఉంటాయి ఆ సాంగ్స్. మరి ఇదే అంశం గురించి అంబికనే అడిగితే.. ఆమె స్పందించింది. అలీ టాక్ షోలో అంబిక ఈ అంశంపై స్పందించింది.

అంబిక సాంగ్స్ అంటే అవి మిడ్ నైట్ సాంగ్స్ కదా.. అంటే, ఔను అంటూ.. అది తనకు గర్వకారణం అంది అంబిక. తమది గ్లామర్ ఫీల్డ్ అని.. ఇలాంటి ఫీల్డ్ లో గ్లామర్ విషయంలో తనకంటూ ప్రత్యేకత ఉన్నప్పుడు అది తనకు గర్వించే అంశమే అవుతుందని అంబిక అభిప్రాయపడింది.

Show comments