నీకు కాస్టింగ్ కౌచ్ కనిపించలేదా బన్నీ

కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంపై తొలిసారి రియాక్ట్ అయ్యాడు హీరో అల్లు అర్జున్. అమ్మాయిల మైండ్ సెట్ లో మార్పు రావాలంటున్నాడు. ఆత్మవిశ్వాసం పెరగాలి అంటున్నాడు. తను, తన తమ్ముడు శిరీష్ ఎప్పుడూ మీటూ గురించే మాట్లాడుకుంటామని చెబుతున్నాడు.

"ఈ అమ్మాయిల గురించి గొడవలు ఏవైనా బయటకు వచ్చినప్పుడు, మీటూ మూమెంట్  వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తుంటుంది. అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి. ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి.. ధైర్యంగా అడుగు ముందుకేయాలి."

మీటూకు మద్దతిచ్చేలా మాట్లాడుతూనే, టాలీవుడ్ ను వెనకేసుకొచ్చాడు బన్నీ. ఉన్న అన్ని పరిశ్రమల్లో టాలీవుడ్ ఒక్కటే క్లీన్ అండ్ గ్రీన్ అంటున్నాడు. హీరోయిన్లకు ఎక్కువ గౌరవం ఇక్కడే దక్కుతుందని చెబుతున్నాడు.

"నేను ఒకటే చెబుతాను. ఇప్పుడున్న అన్ని పరిశ్రమల్లో టాలీవుడ్ చాలా క్లీన్. ఏ హీరోయిన్ ను అయినా అడగండి, అమ్మాయిలకు మ్యాగ్జిమమ్ రెస్పెక్ట్ ఇచ్చే ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకు మీరు ఎప్పుడూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే వెళ్లాలని చూస్తారు అని హీరోయిన్లను చాలామంది అడుగుతుంటారు. దానికి కారణం ఇక్కడ అమ్మాయిలకు ఇచ్చే గౌరవం."

ఇలా తన పరిశ్రమకు వెనకేసుకొచ్చాడు అల్లు అర్జున్. టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ కామెంట్స్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే బన్నీ మరో పని కూడా చేసుంటే బాగుండేది. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న కొంతమంది వ్యక్తుల్ని, కాస్టింగ్ కౌచ్ బాధితులను బన్నీ లాంటి పెద్ద హీరో ప్రస్తావించి ఉంటే ఈ ఉద్యమానికి మరింత ఊపు వచ్చేది.

కానీ బన్నీ మాత్రం మీటూ మూమెంట్ ను పైపైన మాత్రమే టచ్ చేసి వదిలేశాడు. పరిశ్రమ మొత్తం పరిశుభ్రంగా ఉందంటూ కితాబు ఇచ్చేశాడు. ఇదే ఇప్పుడు కొందర్ని బన్నీపై ఆగ్రహం వ్యక్తంచేసేలా చేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో కొందరు ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చెలరేగాయి. రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లు సౌత్ హీరోలపై ఎప్పటికప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

శ్వేతాబసు లాంటి ఎంతోమంది హీరోయిన్లు పరిశ్రమలోని కొందరు 'పెద్దల'కు ఎలా బుక్ అయిపోయారో ప్రత్యక్షంగా చూశాం. తనకు జరిగిన అవమానాల్ని బయటకు చెప్పుకోలేక లోలోపల కుంగిపోయి, టాలీవుడ్ కు దూరమైన హీరోయిన్లు కోకొల్లలు.

మన పరిశ్రమకు ఇంత నీచ చరిత్ర ఉంది. ఇవన్నీ బన్నీకి తెలియని విషయాలు కావు. అంతెందుకు, అతడు నటించిన వరుడు సినిమాలో హీరోయిన్ ఏమైపోయిందో బన్నీకి తెలియకుండా ఉంటుందా..? పైకి ఇన్ని విషయలు కనిపిస్తున్నా, బన్నీ మాత్రం టాలీవుడ్ ను వెనకేసుకొచ్చాడు. క్లీన్ అండ్ గ్రీన్ అంటూ నీతులు చెబుతున్నాడు. 

టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments