మహర్షిలో అల్లరోడు చనిపోతాడా? నిజమెంత?

మహర్షి సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఏంటనే విషయంపై ఇప్పటికే అందరికీ ఓ అవగాహన వచ్చేసింది. సినిమాలో ఓ షేడ్ లో బిలియనీర్ గా, మరో షేడ్ లో స్టూడెంట్ గా, ఇంకో షేడ్ లో రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు మహేష్. మరి ఇదే సినిమాలో మరో కీలకపాత్ర పోషిస్తున్న అల్లరి నరేష్ సంగతేంటి?

మహర్షిలో అల్లరినరేష్ క్యారెక్టర్ చనిపోతుందని కొందరంటున్నారు. గ్రామంలో జరిగే కుల ఘర్షణల్లో అల్లరినరేష్ చనిపోతాడని గాసిప్స్ వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చనిపోతేనే ఎక్కువ ఎమోషన్ పండుతుందని భావిస్తుంటారంతా. అందుకే అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందని పుకార్లు వదుల్తున్నారు.

మరో సెక్షన్ మాత్రం మహర్షిలో అల్లరి నరేష్ పాత్ర చనిపోదంటున్నారు. స్నేహితుడికి సహాయం చేసేందుకు మహేష్ బాబు రంగంలోకి దూకుతాడని... గ్రామాన్ని, వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చేస్తాడని చెబుతున్నారు.

అల్లరినరేష్ పాత్రను పక్కనపెడితే మరికొందరు మాత్రం ఈ సినిమాను శ్రీమంతుడికి సీక్వెల్ గా చెబుతున్నారు. దాదాపు శ్రీమంతుడు సినిమాలో కనిపించే ఛాయలన్నీ మహర్షిలో కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ పుకార్లపై ఓ క్లారిటీ రావాలంటే ట్రయిలర్ రిలీజవ్వాల్సిందే. 

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!

Show comments