ముఖ్యమంత్రిగా జగన్.. ఈరోజు మరో లాంఛనం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ కోసం ఈరోజు మరో లాంఛనం పూర్తికాబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈరోజు తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం అవుతున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటల 31 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జగన్ ను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు.

ఈ లాంఛనం పూర్తయిన వెంటనే తాడేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తారు జగన్. గవర్నర్ ను ప్రత్యేకంగా కలిసి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన శాసనసభాపక్ష తీర్మానాన్ని నరసింహన్ కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించాలని కోరుతారు. 30వ తేదీన విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

గవర్నర్ తో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గౌరవపూర్వకంగా కలుస్తారు జగన్. భవిష్యత్తులో అనుసరంచాల్సిన వ్యూహంపై ఇద్దరూ చర్చలు జరుపుతారు. కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రెంట్ లో జాయిన్ అవుతామని జగన్ ఇప్పటికే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేసీఆర్ ను జగన్ ఆహ్వానిస్తారు.

రేపు ప్రధాని మోడీని కూడా కలవబోతున్నారు జగన్. మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న మోడీని అభినందించబోతున్నారు. ఇదే సమావేశంలో ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని కూడా మోడీ దగ్గర ప్రస్తావిస్తారు జగన్. 

సినిమా రివ్యూ: సీత

Show comments