అందరికీ విజయ్ దేవరకొండే కావాలి

కుర్రాళ్లలో విజయ్ దేవరకొండను మించిన డిపెండబుల్ హీరో మరొకడు లేడు. బన్నీ, రామ్ చరణ్ తర్వాత కేటగిరీలో ఉన్న హీరోలందర్నీ విజయ్ దేవరకొండ క్లీన్ స్వీప్ చేశాడు. నితిన్, గోపీచంద్, రాజ్ తరుణ్, నిఖిల్ లాంటి హీరోల్ని నమ్ముకునే కంటే విజయ్ దేవరకొండతో ఓ సినిమా తీస్తే బెటరనే ఫీలింగ్ ఇండస్ట్రీలో బాగా వచ్చేసింది. అందుకే పైన చెప్పుకున్న హీరోలు కాస్త ఖాళీగా ఉన్నప్పటికీ, కొంతమంది దర్శకులు కేవలం విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే మారుతి గ్యాప్ ఇచ్చాడు. ఒక సినిమా విడుదలకు సిద్ధమైన వెంటనే, ఆ మూవీ ప్రచారంలో తన కొత్త సినిమాను ప్రకటించడం మారుతి స్టయిల్. అలాంటి దర్శకుడు ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నాడు. తనవద్ద ఉన్న 2-3 కథల్లోంచి ఓ స్టోరీని సెలక్ట్ చేసి దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నాడు.

మారుతికి పోటీగా దర్శకుడు గోపీచంద్ మలినేని, పూరి జగన్నాధ్ రెడీ అవుతున్నారు. పూరి జగన్నాధ్ ఇప్పటికే ఓ స్టోరీలైన్ వినిపించాడు. గోపీచంద్ మలినేని కథ రెడీ చేస్తున్నాడు. ఈ దర్శకుల కోసం అడ్వాన్సులు పట్టుకొని ఇద్దరుముగ్గురు నిర్మాతలు విజయ్ దేవరకొండ చుట్టూ తిరుగుతున్నారు.

అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో 2 సినిమాలతో పాటు 4 అడ్వాన్సులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మారుతి, పూరి లాంటి దర్శకులకు విజయ్ దొరికే ఛాన్స్ లేదు. 

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments