అలిగిన పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలిగారు. మరుక్షణం వెనుదిరిగారు. ఇది జరిగింది ఎన్టీవీ చౌదరి కుమార్తె పెళ్లి రిసెప్షన్ లో అని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీవీ చౌదరి ఏకైక కుమార్తె వివాహం రంగ రంగ వైభవంగా నిన్న జరిగింది. దేశం నలుమూలల నుంచి హేమాహేమీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. గవర్నర్, సిఎమ్, వైఎస్ జగన్ వంటి ప్రముఖులు హాజరై, చాలా సేపు అక్కడే వుండి వధూవరులను ఆశీర్వదించారు. 

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం లోపలకు రాకుండానే వెనుదిరిగారు. ఆహ్వానితుల తప్పేమీ లేదు. పవన్ వచ్చిన టైమ్ లోనే సిఎమ్ కూడా వచ్చారు. సిఎమ్ కాన్వాయ్ ముందు ఎవరైతే ఏమిటి? సెక్యూరిటీ ప్రోటోకాల్ అంటూ ఒకటి వుంటుంది. అది గమనించకుండా, సిఎమ్ వస్తే, తనను ఆపుతారా? అని అసహనంతో అలిగి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యణ వేదికలోపలికిగ వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.

చూసిన వాళ్లు అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంత అసహనం అయితే పార్టీని ఎలా నడుపుతారు? ఇలాంటి భారీ పెళ్లిళ్లకు వచ్చినపుడు ఇలాంటివి కామన్ కదా అని ఎవరికి వారే అనుకున్నారు. సినిమాలో అందరూ మీరు దేవుడు బాబూ దేవుడు బాబూ అంటుంటే బహుశా నిజమే అని అనుకుంటున్నారేమో? పవన్ బాబు. దేవుడి ముందు ముఖ్యమంత్రి ఎంత అని అనుకున్నారేమో?

Show comments