బన్నీ-త్రివిక్రమ్-ఏం చూపించబోతున్నారు?

మరి కొన్ని గంటల్లో రాబోతోంది బన్నీ-త్రివిక్రమ్ సినిమా అల వైకుంఠపురములో టీజర్. ఇది ఎలా వుండబోతోందన్నదే ఫ్యాన్స్ కు ఆసక్తిగా వున్న విషయం. సాయంత్రం 5.04 నిమషాలకు రాబోతున్న టీజర్ విషయంలో యూనిట్ చాలా జాగ్రత్తగా వుంది. కొన్నాళ్ల క్రితమే గ్రేట్ ఆంధ్ర వెల్లడించినట్లుగానే టీజర్ నిడివి జస్ట్ వన్ మినిట్ కు ఒకటి రెండు సెకెండ్లు అటో ఇటో మాత్రమే వుంటుందని తెలుస్తోంది.

దాదాపు సినిమాలో వున్న కీలక క్యారెక్టర్లు అన్నీ టీజర్ లో కనిపించే అవకాశం వుంది. అదే టైమ్ లో ఓ మాస్ ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ కు ఏమేం కావాలో అవన్నీ టీజర్ లో వుండేలా చూసుకుని, అంటే ఫన్, యాక్షన్, ఫ్యామిలీ టచ్, ఆఖరికి గ్లామర్ ప్లస్ రొమాన్స్ ఇలా అన్నీ జోడిస్తూ ఈ టీజర్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇవన్నీ వున్న తరువాత ఇంకా లోపం అనుకుంటారేమో అని అక్కడక్కడ ఒకటి రెండు యాక్షన్ కట్ లు, చివరగా త్రివిక్రమ్ స్టయిల్ ముక్తాయింపు వుండే వుంటుందనే అనుకోవాలి.మొత్తం మీద ఈ టీజర్ తో సంక్రాంతి సినిమాల మధ్య పోటీ మరింత హీట్ ఎక్కుతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్.

Show comments