అలా అడల్ట్‌ స్టార్‌ని అయ్యాను: సన్నీలియోన్‌

ఏదో అనుకోకుండా పోర్న్‌ సినిమాల్లోకి తాను రాలేదని మరోమారు స్పష్టతనిచ్చింది ఒకప్పటి పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌. ఏం చేసినా, ఓసారి వచ్చిన 'పోర్న్‌స్టార్‌' ఇమేజ్‌ ఎప్పటికీ చెరిగిపోదనే విషయం అప్పట్లోనే తనకు తెలుసంటోన్న సన్నీలియోన్‌, ఇప్పుడు తానేంటో తన పనేంటో అందరూ చూస్తూనే వున్నారనీ, గతకాలపు జ్ఞాపకాలు ఇంకా ఎప్పటికీ అలాగే తనతో వుంటాయనీ చెప్పుకొచ్చింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో. 

'పోర్న్‌ కెరీర్‌ని నేనెప్పుడూ తప్పుగా అనుకోలేదు. ఆ సమయానికి అది కరెక్ట్‌ అని భావించే, ఆ వైపుగా నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరి ఒత్తిడీ నా మీద లేదు. నా బయోపిక్‌లో వున్నది నా జీవితమే. అక్కడక్కడా కమర్షియల్‌ లిబర్టీ కోసం కొంచెం డీవియేషన్‌ వుండొచ్చుగానీ.. అదంతా నా జీవితంలో జరిగినట్లేగానే వుంది..' అని చెబుతోంది సన్నీలియోన్‌. ఆల్రెడీ సన్నీలియోన్‌ బయోపిక్‌, వెబ్‌ సిరీస్‌గా ఓ పార్ట్‌ వచ్చేసింది. మరో పార్ట్‌ రాబోతోంది కూడా. 

నిజానికి సన్నీలియోన్‌, తన బయోపిక్‌ని తానే తెరకెక్కించాలని అనుకుంది గానీ.. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ఆ ఆలోచనని విరమించుకుందట. తనకిప్పుడు ముగ్గురు పిల్లలున్నారనీ, ఇద్దరు అబ్బాయిలు - ఓ అమ్మాయికి తల్లిగా తన బాధ్యతలు తనకు తెలుసనీ, సినిమా అవకాశాల్ని కొంతవరకు తగ్గించుకుని, కుటుంబ బాధ్యతల్ని చూసుకోవాల్సి వుందనీ అంటోంది సన్నీలియోన్‌. 

ఓ అమ్మాయిని సన్నీలియోన్‌, ఆమె భర్త డేనియల్‌ వెబర్‌ దత్తత తీసుకోగా, ఆ తర్వాత ఈ ఇద్దరూ సరోగసీ మార్గంలో కవల పిల్లలకు తల్లిదండ్రులయిన సంగతి తెల్సిందే. తన పిల్లలకు తన బయోపిక్‌ చూపించకుండా వుండలేననీ, తన గురించి వాళ్ళకు అన్నీ తెలుస్తాయనీ, అయితే ఇప్పుడు చెప్పినా వారికి అవేమీ అర్థం కావని సన్నీలియోన్‌ చెప్పుకొచ్చింది.

Show comments