పరారీలో అఖిలప్రియ భర్త!

పరారీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల జాబితాలో తాజాగా చేరారు మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్. సినిమా పక్కీలో భార్గవ్ రామ్ వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకు దొరకకుండా పరార్ అయ్యేందుకు వివిధ టెక్నిక్స్ ఉపయోగించాడట అఖిలప్రియ భర్త. భార్గవ్ రామ్ పై ఇప్పటికే ఆళ్లగడ్డ పరిధిలో వివిధ కేసులు నమోదయ్యాయి.

వాటిల్లో హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో తలదాచుకున్న అతడిని పట్టుకోవడానికి ఆళ్లగడ్డ పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అతడిని గుర్తించి, గచ్చిబౌలి ప్రాంతంలో కారులో వెళ్తున్న అతడిని ఆపమని పోలీసులు కోరారు. వారు చేయి ఎత్తగానే ఆపినట్టుగానే ఆపి, వెంటనే కారును ముందుకు పోనిచ్చాడట. కారుకు దగ్గరగా వచ్చిన పోలీసులును ఢీ కొట్టినంత పని చేశాడట అఖిలప్రియ భర్త. దీంతో పోలీసులు అవాక్కయినట్టుగా తెలుస్తోంది.

పోలీసులు పిలుస్తున్నా అతడు కారును ఆపకుండా అక్కడ నుంచి అందులోనే పరార్ అయినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అతడిని వెంబడించినా దొరకలేదని తెలుస్తోంది. ఇలా మాజీ మంత్రిగారి భర్త పరార్ అయ్యారట. దీంతో పోలీసులు అతడు తమతో వ్యవహరించిన తీరుపై గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడిని పట్టుకోవడానికి వస్తే తమను కారుతో ఢీ కొట్టినంత పని చేశాడని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని సమాచారం!

చంద్రబాబుకు ఎందుకు రుచించడం లేదు