భర్తకు ఎంపీ టికెట్ అడుగుతున్న ఏపీ మంత్రిగారు!

తన భర్తకు నంద్యాల ఎంపీ టికెట్ ఇవ్వాలని, తన సోదరుడికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్లు, ఆపై తనకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టికెట్ కావాలి.. అనేది మంత్రి అఖిలప్రియ డిమాండ్ గా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల విషయంలో చంద్రబాబు ముందు అఖిలప్రియ ఈ ప్రతిపాదనలు పెట్టినట్టుగా సమాచారం. రాజకీయాల్లో భర్తకు భార్య రాజకీయ జీవితం ఇచ్చే రోజులు వచ్చేసినట్టుగా ఉన్నాయి. భర్తను అఖిలప్రియ బాగానే ప్రమోట్ చేస్తోంది కానీ..  చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు ససేమేరా అన్నట్టుగా సమాచారం.

అఖిలప్రియ కోరుతున్నట్టుగా నంద్యాల ఎంపీ టికెట్ ను ఆమె భర్తకు కేటాయించడానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆసక్తితో లేడని.. అలాగే నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ను భూమా బ్రహ్మానికి ఇచ్చేది కూడా లేదని చంద్రబాబు  నాయుడు ఇది వరకే కుండబద్ధలు కొట్టినట్టుగా తెలుస్తోంది.

అంతిమంగా ఆళ్లగడ్డ టికెట్ మాత్రమే భూమా ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు ఇచ్చే గిఫ్ట్ అని సమాచారం. అయితే అఖిలప్రియ ఈ విషయంలో అసంతృప్తిగా ఉందని సమాచారం. తను కోరినట్టుగా ఒక ఎంపీ టికెట్, రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారట. 

ఈ నేపథ్యంలోనే ఆమె టీడీపీని వీడతారు అనే టాక్ వచ్చింది. దాన్ని అఖిల ఖండించింది. అయితే తెలుగుదేశం లో మాత్రం ఈమె కోరినన్ని సీట్లు దక్కే అవకాశాలు లేవు. దక్కకపోయినా రాజీ పడిపోతుందా లేక.. కోరిన్ని సీట్లు తీసుకునే అవకాశం ఉన్న జనసేనలోకి జంప్ చేస్తుందా చూడాలిక!

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

Show comments