ప్రభాస్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన అజిత్!

ఉన్నట్టుండి ‘సాహో’ సినిమా సెట్స్ మీదకు వచ్చి ఆ సినిమా యూనిట్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడట తమిళ హీరో అజిత్. ఒక తెలుగు సినిమా షూటింగ్ సెట్స్ మీదకు తమిళ హీరో రావడం ఆశ్చర్యమే. ఆర్ ఎఫ్ సీలో అజిత్ సినిమా షూటింగ్ కూడా సాగుతూ ఉండటం, ఆ సమీపంలోనే ‘సాహో’ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో అజిత్ అక్కడ ప్రత్యక్షం అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాహో’ యూనిట్ ను పలకరించడానికి వచ్చాడట అజిత్.

‘బాహుబలి’ తర్వాత  ప్రబాస్ ఇమేజ్ పక్క భాషల్లో కూడా గట్టిగా ఉన్న నేపథ్యంలో అజిత్ కూడా ఈ సినిమా సెట్స్ వైపు ఆసక్తితో వచ్చినట్టుగా ఉన్నాడు.  ఇది వరకూ అజిత్ తమిళంలో చేసిన ‘బిల్లా’ సినిమాను  తెలుగులో ప్రభాస్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ హీరోలిద్దరూ ఒకే పాత్రను పండించిన నేపథ్యం ఉన్నవాళ్లు.

‘సాహో’ సెట్స్ మీద వీళ్లిద్దరూ సెల్ఫీలు తీసుకున్నారట. అయితే వాటిని ఇద్దరూ సోషల్ మీడియాలో పెట్టలేదు ఇంకా. హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. దానికోసమే అజిత్ అక్కడకు వచ్చినట్టుగా సమాచారం. 

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?