'ఏజెంట్' మళ్లీ మరోసారి?

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనగానే నవీన్ పోలిశెట్టి గుర్తుకు వస్తాడు. స్టాండింగ్ కమెడియన్ నుంచి వెండితెరకు వచ్చి తొలి సినిమాతో డిఫరెంట్ సినిమా లవర్స్ ను బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ వెంటనే తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఈలోగా బాలీవుడ్ లో ఓ సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు. చిచ్చోరె సినిమాలో పార్ట్ కావడం ద్వారా 150 కోట్ల బాక్సాఫీస్ హిట్ సినిమాలో నటించానన్న పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలకు అడ్వాన్స్ లు అందుకున్నాడు. గీతాలో ఒకటి, స్వప్న సినిమాలో మరోటి ఒప్పుకున్నారు. ఇప్పుడు వీటల్లో ఒకటి మెటీరియలైజ్ కాబోతోందని తెలుస్తోంది. అయితే మిగిలిన వివరాలు ఇంకా తెలియకున్నా, ఓ గమ్మత్తు అయిన గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మరో ఇన్వెస్టిగేషన్ తో జనం ముందుకు వస్తే ఎలా వుంటుంది? అన్న ఆలోచన ఒకటి చేస్తున్నట్లు బోగట్టా. అయితే అలా చేయాలంటే అదే డైరక్టర్ కూడా వుండాలేమో? అయితే ఆ సినిమా డైరక్టర్ స్వరూప్ కూడా వేరే ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మళ్లీ నవీన్-స్వరూప్ కలిసి, మరో ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం గమ్మత్తుగా వుంటుందేమో?

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం