అదిగో బాలీవుడ్.. ఇదిగో బన్నీ

బన్నీ మౌనం పుణ్యమా అని అనేక వార్తలు పుట్టుకు వస్తున్నాయి. విక్రమ్ కె కుమార్ తో స్క్రిప్ట్ లాక్ చేయించి మరీ ఎందుకు ప్రకటించడం లేదన్నది బన్నీ కే తెలియాలి. అక్టోబర్ లో ప్రకటన వస్తుందన్నదే మెగా క్యాంప్ సమాచారం. అలాగే కొన్నిరోజుల క్రితం గ్రేట్ ఆంధ్ర వెల్లడించినట్లు ఓ తమిళ సినిమాలో 40 నిమిషాల కీలక పాత్రను కూడా బన్నీ ఓకె చేసాడు.

ఇలాంటి నేపథ్యంలో బన్నీ బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడని, అది కూడా ఓ బయోపిక్ అనీ వార్తలు బయటకు వచ్చాయి. ఇవి నిజం అని కానీ, అబద్దం అని కానీ ఎవ్వరూ ఖండించడం లేదు. కానీ బన్నీ క్యాంప్ మాత్రం అవన్నీ గాలి కబుర్లు అంటోంది. 

బన్నీ దృష్టికి మెగా జనాలు కొందరు ఈ విషయం తీసుకువెళ్తే..'మనల్ని అడిగితే అంతా బుస్.. నో అని చెప్పండి. మనల్ని అడగకుండా వాళ్లు ఏం రాసుకుంటే అది రాసుకోనివ్వండి' అని సమాధానం ఇచ్చారట. అక్టోబర్ లో మన సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది అని కూడా చెప్పాడట.

మరి అదేదో ఓ మాట క్లారిటీగా అనౌన్స్ చేస్తే బెటర్ కదా? ఆ తరువాత ఎప్పుడు ఓపెన్ చేసుకున్నా, ఎప్పుడు స్టార్ట్ చేసినా సమస్య వుండదు. కానీ ఎందుకు కావాలని బన్నీ ఇలా గ్యాసిప్ లకు తావిస్తున్నట్లో?

RELATED ఆమెకు మంచి రోజులొచ్చాయా?