దెబ్బకి అచ్చెన్నాయుడి సీటు మారింది

చంద్రబాబు పక్కన కూర్చుని అసెంబ్లీలో వైసీపీపై ఎగిరెగిరి పడ్డ అచ్చెన్నాయుడు దెబ్బకి సెట్ రైట్ అయ్యారు. బాబు పక్క సీటు బుచ్చయ్య చౌదరికి వదిలేసి సైలెంట్ గా వెనక్కెళ్లి కూర్చున్నారు. సభ్యులకు సీట్ల కేటాయింపులపై అసెంబ్లీలో నిన్న జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇవ్వడంకోసమే నిన్న అసెంబ్లీలో వైసీపీ ఓ పద్ధతి ప్రకారం వెళ్లింది.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సీటు నుంచి లేచి వచ్చి చంద్రబాబు పక్కగా కూర్చున్నారు. పదే పదే చంద్రబాబు మాటలకు శ్రీధర్ రెడ్డి అడ్డు తగులుతుండే సరికి స్పీకర్ ఒకింత అసహనం వ్యక్తంచేసి, వైసీపీ ఎమ్మెల్యేను వెనక్కి వెళ్లి కూర్చోమన్నారు. స్పీకర్ మాటపై గౌరవంతో శ్రీధర్ రెడ్డి వెనక్కి వెళ్లి కూర్చున్నారు.

అంతలో సీఎం జగన్ అందుకుని మేం మీరు చెప్పినమాట విన్నాం, మరి టీడీపీ నేతల సంగతేంటి, అచ్చెన్నాయుడికి రూల్స్ వర్తించవా అన్నారు. కాసేపు అచ్చెన్నాయుడు మొండికేసినా చివరకు ప్లేస్ మార్చక తప్పలేదు. అచ్చెన్నాయుడు వెనక్కి వెళ్లిపోవడంతో, బుచ్చయ్య చౌదరి బాబు పక్కనవచ్చి కూర్చున్నారు.

అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి రెచ్చిపోతున్న అచ్చెన్నాయుడు సీటు మార్చేసరికి కాస్త సైలెంట్ అయ్యారు. అయితే టీడీపీ నేతలు మాత్రం సీట్ల విషయంలో రచ్చ ఆపలేదు. స్పీకర్ సభా సంప్రదాయాలను పాటించడంలేదని అంటూ గొడవకు దిగారు టీడీపీ ఎమ్మెల్యేలు, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ కాసేపు హడావుడి చేశారు.

ఇంతలో స్పీకర్ చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నన్ను భయపెట్టాలని చూడొద్దు, స్పీకర్ చైర్ కి సలహాలివ్వొద్దు అంటూ తీవ్ర స్వరంతో మందలించే సరికి అందరూ సైలెంట్ అయ్యారు.

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి