ఎబిసిడి.. మళ్లీ ఎల్కేజీ నుంచి?

ఎబిసిడి అంటేనే ఎల్కేజీ చదువు. అల్లుశిరీష్ హీరోగా భరత్ సహనటుడిగా మధుర శ్రీధర్ నిర్మించిన చిత్రం ఎబిసిడి. మలయాళ సినిమా ఎబిసిడి దీనికి మాతృక. అయితే సినిమా పూర్తయి చాలాకాలం అయినా కంటెంట్ విషయంలో సంతృప్తి దొరకక అలా పక్కన పెట్టారు. రెండు డేట్లు మార్చి మూడో డేట్ ఇచ్చారు. కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి దీనికి దర్శకుడు. 

అయితే లేటెస్ట్ విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ సినిమాను సాయం పట్టి గట్టెక్కిటంచడానికి మరో దర్శకుడు రంగంలోకి దిగారన్నది. పవన్ సాధినేని అనే దర్శకుడు సినిమా మొత్తం చూసి, కొత్తగా కొన్ని సీన్లు రాసి, వాటిని, అలాగే పాతవాటిని కొన్ని రీషూట్ చేయడం లాంటి పని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ పని మరో నాలుగు రోజుల వరకు వుంటుందని తెలుస్తోంది. 

మే 16న విడుదల చేయాలని సంకల్పం. మరి ఇప్పుడు రెండో దర్శకుడు రిపేర్లు చేస్తున్నారు. పాతవి, కొత్తవి మాచ్ కావాలి. జోడింపులు జరగాలి. ఏమిటో అల్లుశిరీష్ సినిమాలు అంటే ఈ సమస్యలు తప్పడంలేదు. గతంలో ఓ సినిమాను కూడా ఇలాగే ఒకటి కి వందసార్లు ఎడిట్ సూట్ లో వేసుకుని, చూసుకుని, అటు మార్చి, ఇటు మార్చి వదిలారని బోగట్టా.

పైగా ఎబిసిడి సినిమా విషయంలో హీరో అల్లుశిరీష్ చాలా ఎక్కువ ఇన్ వాల్వ్ అయ్యాడని, ఆయన కూడా కొన్నిసీన్లు డైరక్ట్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద ముగ్గురు నలుగురు కలిసి, ఎబిసిడి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం ఏదో గట్టిగానే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా? 

Show comments