ఆరు నూరైనా సంక్రాంతికే బన్నీ సినిమా

బన్నీ-త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి కాకుండా డిసెంబర్ లో విడుదల చేస్తారంటూ విపరీతంగా గ్యాసిప్ లు వినిపించాయి. జనవరిలో ఏకంగా మూడు, నాలుగు సినిమాలు వుండే అవకాశం క్లియర్ గా కనిపిస్తున్నందున, డిసెంబర్ అయితే సేఫ్ బెట్ అని, ఈ గ్యాసిప్ ల సారాంశం.

అయితే చిత్ర నిర్మాణ యూనిట్ మాత్రం అవన్నీ వట్టి గ్యాసిప్ లే అని కొట్టి పారేస్తున్నట్లు బోగట్టా. జనవరి 11 లేదా 13లో ఏ డేట్ ఫిక్స్ చేసుకోవాలనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంటల్ గా 9, 10 డేట్ లు పనికిరావని పక్కన పెట్టేసారు. మహేష్-అనిల్ రావిపూడి సినిమాకు ఓ రోజు ముందు కానీ ఒక రోజు వెనుకగా గానీ సినిమా వుంటుందని స్ఫష్టం చేస్తున్నారు.

అటు మహేష్ సినిమా అయినా, ఇటు బన్నీ సినిమా అయినా పంపిణీ చేయాల్సింది మాత్రం దిల్ రాజునే. ప్రస్తుతానికి ఇంకా టూ ఎర్లీ కనుక, ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టి సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. సంక్రాంతి విడుదల మాత్రం పక్కా అంటున్నారు.

ఓవర్ సీస్ మార్కెట్ లో కాస్త గట్టి పోటీ వుండేది ఈ రెండు సినిమాలకే. బాలయ్య సినిమా వున్నా కూడా ఓవర్ సీస్ లో సమస్య ఏమీవుండదు. 

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ