ఆ యంగ్ హీరోకు మీమాంస

తెలుగునాట ఇప్పుడు మల్టీస్టారర్ల క్రేజ్ నడుస్తోంది. కొత్త కొత్త క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడానికే నిర్మాతలు, దర్శకులు చూస్తున్నారు. కానీ ఇక్కడే మరో సమస్య కాస్త మంచి మార్కెట్ వున్న ప్రతి హీరో బిజీగా వుంటున్నారు. దర్శకుడు ఇంద్రగంటిదీ ఇదే సమస్య. ఆయన ఇద్దరు హీరోల కథ తయారుచేసుకున్నారు. నిర్మాతగా దిల్ రాజు రెడీ.

కానీ హీరోలే దొరకడంలేదు. ఒక హీరోగా నాని ఓకె అన్నారు. కానీ నానికి తగినట్లు మరో హీరో కావాలి. ముగ్గురు నలుగురికి ఇంద్రగంటి కథ చెప్పారు. కానీ ఇంకా ఎవరు సెట్ కాలేదు. కథ విన్నవారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఇలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వెనుక వేరే రీజన్ వుందని తెలుస్తోంది. దుల్కర్ కు తమిళంలో ఓ మంచి చాన్స్ వచ్చేలా వుందని సమాచారం వుందట. ఆ చాన్స్ మరోటీ మరోటీ కాదు. దిగ్దర్శకుడు శంకర్ నిర్మించే ఇండియన్ 2లో ఓ కీలకమైన యువ హీరో క్యారెక్టర్ వుందట.

దానికి దుల్కర్ అయితే ఎలా వుంటుందని శంకర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం బయటకు పొక్కింది. అయితే శంకర్ నుంచి ఇంకా దుల్కర్ దాకా సమాచారం రాలేదు. దానికోసం దుల్కర్ వెయిట్ చేస్తున్నట్లు వినికిడి. ఆ చాన్స్ వస్తే, తెలుగులో ఇంద్రగంటి సినిమా చేయడం కష్టం.

అదే కనుక, ఇండియన్ 2లో చాన్స్ లేదని తెలిసిపోతే, నాని కాంబినేషన్ లో ఇంద్రగంటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని టాక్. అందుకే ఇంద్రగంటి వెయింటింగ్ ఇప్పుడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. నాని-దుల్కర్-ఇంద్రగంటి కాంబినేషన్ అంటే మాత్రం, అంచనాలు భలేగా వుంటాయి.

Show comments