ఆ నిర్మాత కూతురికి దేశం టికెట్

చాలాకాలం తరువాత ఆ నిర్మాత పేరు మళ్లీ విశాఖజిల్లా రాజకీయాల్లో వినిపించింది. బాలయ్యతో, ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మించిన నిర్మాత చెంగల వెంకటరావు. హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసి, అప్పట్లో సంచలనాలకు కారణమైన నిర్మాత అతను. గతంలో ఆయన పాయకరావుపేట ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

కానీ తరువాత వివిధ సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ఓ కేసులో శిక్షపడి ప్రస్తుతం జైలులో వున్నారు. ఇన్నాళ్ల తరువాత మళ్లీ ఆయన కుటుంబానికి మంచిరోజులు వచ్చినట్లున్నాయి. అదే పాయకరావుపేట నియోజక వర్గానికి గాను తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆయన కుమార్తె విజయలక్ష్మికి కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ వున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత పట్ల స్థానికంగా కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో విజయలక్ష్మికి టికెట్ రావడం సాధ్యమవుతోందని బోగట్టా.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!