ఆ ఆర్టిస్ట్ చాలా కాస్ట్ లీ గురూ

ఆయన మాంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏ పాత్ర ఇచ్చినా పండించి శభాష్ అనిపించేస్తాడు. అలాంటపుడు ఎంత రెమ్యూనిరేషన్ అయినా ఇవ్వొచ్చు అన్నది ఒక పాయింట్. కానీ టాలీవుడ్ ఇప్పుడు అలా అనుకోవడం లేదు. అబ్బో చాలా కాస్ట్ లీ వ్యవహారం అనుకుంటోంది.

ఎందుకంటే ఇప్పుడు ఆయన రోజుల లెక్కన రోజుకు నాలుగు లక్షలు తీసుకుంటున్నట్లు బోగట్టా.  పొనీ ఒకటి రెండు రోజులో, పద రోజులో పని వుంటుంది అని సరిపెట్టుకోవడానికి లేదు. ఆయనకు ఇచ్చే పాత్రలు కీలకంగా వుంటాయి. సినిమా ఫుల్ లెంగ్త్ వుంటాయి. అందువల్ల కనీసం ఓ యాభై కాల్ షీట్లు అయినా అవసరం పడతాయి. అప్పుడు రెండు కోట్లు అవుతుంది పారితోషికం.

అంతే కాదు, ఆయన ఖర్చులు కూడా ఎక్కువే అని టాక్. ఆయన రెండు కార్లలో వస్తారట. ఒక కారులో ఆయన, రెండో కారులో వ్యక్తిగత స్టాఫ్. ఈ మెయింట్ నెన్స్ అంతా నిర్మాత ఖాతాలోనే అని వినికిడి.

దీంతో ఆయనకు ఆల్టర్ నేటివ్ నటులను వెదుకుతున్నారట చాలా మంది నిర్మాతలు, దర్శకులు. అవసరం అయితే పక్క భాషల నుంచి తేవడం, లేదా ఇప్పటికే వున్న మంచి నటులను పెట్టుకోవడం చేస్తున్నారట. ఈ సంగతి గమనించి అయినా ఆయన తన రేటు కాస్త తగ్గించుకుంటే బెటర్ ఏమో?

ఎందుకంటే టాలీవుడ్ ఓసారి పక్కన పెట్టడం ప్రారంభిస్తే, అది అలా పెరిగిపోతుంది. అలా చేస్తే ఓ మంచి నటుడిని తెలుగు జనాలు మిస్ అవుతారు.