4 కోట్ల టికెట్లు తెగాలి ఈ సంక్రాంతికి

ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ చాలా భారీగా రెడీ అవుతోంది. ఒకటి రెండుకోట్లు ఏకంగా దాదాపు 400 కోట్ల రూపాయిలు తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఈ సంక్రాంతి సీజన్ లో సినిమాల కోసం ఖర్చుచేయాల్సి వుంది. నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అవి కూడా దాదాపు అన్నీ ఓ రేంజ్ సినిమాలు. మొత్తం నాలుగు సినిమాలు కలిపి దాదాపుగా నాలుగు వందల కోట్ల మేరకు మార్కెట్ జరిగింది. 

బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లోని వినయ విధేయరామ డోమెస్టిక్, ఓవర్ సీస్, రెస్టాఫ్ ది ఇండియా అన్నీకలిపి థియేటర్ బిజినెస్ నే దగ్గర దగ్గర 75 నుంచి 80 కోట్ల వరకు జరిగింది.

బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా అదే విధంగా వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు 80 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది.

వెంకటేష్-వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 ఈ రేంజ్ లో కాకపోయినా, దాదాపు 35  కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసారు.

రజనీకాంత్ పెటా కూడా దాదాపు 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది.

అంటే దాదాపు 200 నుంచి 215 కోట్ల మేరకు థియేటర్ బిజినెస్ జరిగింది. అంటే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల నుంచి 400 కోట్లకు పైగా డబ్బులు రావాలి. అప్పుడే ఎవరి డబ్బులు వారికి వచ్చినట్లు. ఆ పైన లాభాలు, కమిషన్లు, ఖర్చులు వగైరా. టికెట్ రేటు సగటున 100 రూపాయలు వేసుకున్నా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది ఈ సినిమాలు చూడాలన్నమాట. 

ఇదిలావుంటే ఈ రేంజ్ బిజినెస్ థియేటర్లలో జరిగింది అంటే నాన్ టికెట్ ఇన్ కమ్ అంటే పార్కింగ్, స్నాక్స్, డ్రింక్స్ వగైరా బిజినెస్ కనీసం 50 కోట్లు అన్నా వుంటుంది. అంటే టోటల్ గా తెలుగుజనాలు ఈ సంక్రాంతి సీజన్ లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం సినిమాల కోసం ఖర్చుచేయాల్సిన మొత్తం 450 కోట్ల పైనే.

చూడాలి రిజల్ట్ ఎలా వుంటుందో?

చంద్రబాబును దింపడమే నా లక్ష్యం... ఆయన్ను అసహ్యించుకుంటున్నారు 

అప్పట్నుంచి ఇండియాలో పోర్న్ వీక్షణ పెరిగింది!

Show comments