ముచ్చటగా 3 సినిమాలు.. సరిసమానంగా అంచనాలు

వారంతంలో ఎన్ని సినిమాలొచ్చినా వాటిలో అంచనాలు పెంచే సినిమా ఒకటి మాత్రమే ఉంటుంది. పోటీ అనివార్యమైనప్పడు రెండు సినిమాలు పోటీపడుతుంటాయి. కానీ ఈ వీకెండ్ వస్తున్న మూడు సినిమాలు వేటికవే విభిన్నం. ప్రతి సినిమాపై అంచనాలున్నాయి. అదే ఈసారి బాక్సాఫీస్ స్పెషల్.

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. గరుడవేగ లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాటు.. మూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రయిలర్ హిట్ అవ్వడం ఈ సినిమాను లైమ్ లైట్లో నిలబెట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మర్డర్ మిస్టరీ ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.

కల్కితో సమానంగా అంచనాల్ని అందుకున్న సినిమా బ్రోచేవారెవరురా. శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాపై కూడా ఎక్స్ పెక్టేషన్స్ బాగా పెరిగాయి. కల్కిపై ఎందుకు అంచనాలు పెరిగాయో, ఇక్కడ కూడా అందుకే అంచనాలు పెరిగాయి. బ్రోచేవారెవరురా సాంగ్స్ హిట్ అవ్వడంతో పాటు టీజర్, ట్రయిలర్, తాజాగా విడుదల చేసిన కామెడీ ప్రోమో కూడా హిట్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న బుర్రకథ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా స్టోరీలైన్. ఒక మనిషి పుర్రెలో రెండు బ్రెయిన్స్ ఉండడం అనేది ఈ సినిమా కాన్సెప్ట్. దాన్ని కూడా వినోదభరితంగా చెప్పారు. ట్రయిలర్ లో కూడా అదే చూపించారు. పైగా ఈ సినిమాకు నాని లాంటి హీరోలు ప్రచారం కల్పించడం కూడా కలిసొచ్చింది.

ఇలా దాదాపు సరిసమానమైన అంచనాలతో ఈ 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏది క్లిక్ అవుతుందనేది అందర్లో ఆసక్తికరంగా మారింది.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments