రూ.రెండు వేల నోటును ఆపేశారు!

రెండువేల రూపాయల నోటు ముద్రణ పూర్తిగా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆర్టీఐ ద్వారా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండు వేల రూపాయల నోటు మారకంపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి సామాన్య ప్రజల్లో. ఈ అంశం మీద పార్లమెంటులో ఎంపీలు కూడా పలు సందేహాలను వ్యక్తంచేశారు. తాజాగా ఆర్బీఐ కుండబద్ధలు కొట్టింది. గత ఏడాది కాలంగా రెండు వేల రూపాయల నోటు ముద్రణ పూర్తిగా ఆపేసినట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ఇచ్చింది.

ఒక మీడియా సంస్థ ఆర్టీఐ ద్వారా చేసిన దరఖాస్తుకు ఈ మేరకు సమాధానం వచ్చినట్టుగా తెలుస్తోంది. డీ మానిటైజేషన్ తర్వాత రెండువేల రూపాయల నోటు వచ్చిన సంగతి తెలిసిందే. అంతవరకూ ప్రజలు ఎరగని రెండు వేల రూపాయల నోటు మారకంలోకి వచ్చింది. వస్తూవస్తూనే.. చిల్లర విషయంలో కుదిపేసింది. అప్పటికే క్యాష్ క్రంచ్ ఉంది. దానికితోడు రెండు వేల రూపాయల నోటు రావడం పక్కా తుగ్లక్ చర్య అని ప్రజలు అనుకోసాగారు.

ఇక ఏ లక్ష్యాలతో అయితే డీమానిటైజేషన్ చేశారో.. అవి నెరవేరనే లేదు. దొంగ నోట్లను అరికట్టడం డీ మానిటైజేషన్ లక్ష్యం అన్నారు. అయితే అతి తక్కువ కాలంలోనే రెండు వేల రూపాయల నోటుకు నకిలీలు వచ్చాయి. అవీ మారకంలోకి వచ్చాయి. ఒరిజినల్ కు ధీటైన రెండు వేల రూపాయల నకిలీ నోట్లు తయారు చేస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ధారించాయి. జాగ్రత్తగా ఉండమని ప్రజలను హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ రెండువేల రూపాయల నోటు ముద్రణను ఆపేసింది. ఉన్న పాతనోట్లు చలామణిలోనే ఉంటాయి. ఆ విషయంలో ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు. కొత్త నోట్లు ఇప్పుడప్పుడే వచ్చేలా లేవు. ఏటీఎంలలో పది వేలకు మించి డ్రా చేసినప్పుడు మాత్రమే రెండు వేల రూపాయల నోటు కనిపిస్తూ ఉంది. 

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!

Show comments