28న గ్యాంగ్ లీడర్ ట్రయిలర్

నాని-విక్రమ్ కుమార్ వెరైటీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రీమూవీస్ నిర్మించే ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నారు. ప్రభాస్ భారీ సినిమా సాహో, వరుణ్ తేజ్ మాస్ సినిమా వాల్మీకి పోటీగా వున్నా, బరిలోకి ధైర్యంగా దిగడానికి కారణం 'గ్యాంగ లీడర్' పక్కా ప్యామిలీ సినిమా కావడమే. సాహో ఫుల్ హలీవుడ్ యాక్షన్ సినిమా. వాల్మీకి రఫ్ మాస్ సినిమా. కానీ గ్యాంగ్ లీడర్ మాత్రం పక్కా ఫ్యామిలీ సినిమా.

ఇదిలావుంటే ప్రమోషన్లలో భాగంగా గ్యాంగ్ లీడర్ సినిమా ట్రయిలర్ ను ఈనెల 28న విడుదల చేస్తున్నారు. అలాగే ఓ ప్రమోషన్ సాంగ్ విడుదలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. చెన్నయ్ లో యూనిట్ మొత్తం రెండురోజుల పాటు కష్టపడి ఓ ప్రమోషన్ సాంగ్ ను కూడా పిక్చరైజ్ చేసారు. ట్రయిలర్ విడుదల చేసిన తరువాత ఒకటి రెండురోజులు గ్యాప్ ఇచ్చి ఆ ప్రమోషన్ సాంగ్ ను విడుదల చేస్తారు.

ఇదిలావుంటే ముందుగా అనుకున్న కార్యక్రమం ప్రకారం హీరో నాని తన స్వంత పని మీద విదేశాలకు వెళ్లాల్సివుంది. కానీ ఆగస్టు 30 అనుకున్న గ్యాంగ్ లీడర్ రెండువారాలు వాయిదాపడింది. కానీ నాని మాత్రం విదేశాలకు వెళ్లి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో తిరిగి వస్తారు. అక్కడి నుంచి వారంపాటు ప్రమోషన్లలో పాల్గొంటారు.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?