2018 సెకండాఫ్ ముగిసినట్లేనా?

2018 సెకండాఫ్ డల్ గా వుంటుంది.. అరవింత సమేత తప్పమరో జోష్, కిక్ ఇచ్చే సినిమా వుండదు అనుకున్నారు. కానీ హిట్లు, ఫ్లాపుల సంగతి అలా వుంచితే జూలై నుంచి అక్టోబర్ వరకు విపరీతంగా సినిమాలు వచ్చిపడ్డాయి. గీత గోవిందం బాక్సాఫీస్ ను ఊపు ఊపేసింది. దాదాపు అన్ని వీకెండ్ ల్లో థియేటర్లన్నీ కిటకిటలాడాయి. సినిమాలే సినిమాలు. 

అక్టోబర్ తో ఈ ఊపు కాస్త చల్లబడుతున్నట్లు కనిపిస్తోంది. దసరాకు రెండు సినిమాలు ఢీ కొంటున్నాయి. అరవింద సమేతకు పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే రామ్-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో హలోగురూ ప్రేమకోసమే విడుదలకు రెడీ అయిపోతోంది. అలాగే విశాల్ పందెంకోడి కూడా అదే డేట్ కు వస్తోంది.

ఆ మలివారం శ్రీవిష్ణు-నారా రోహిత్-శ్రియ నటించిన వీరభోగ వసంతరాయలు విడుదలవుతోంది. అక్కడితో అక్టోబర్ ముగిసినట్లే. నవంబర్ 2న చైతన్య సవ్యసాచి, 7న విజయ్ దేవరకొండ టాక్సీవాలా వుంటాయి. 

నవంబర్ లో నిఖిల్ 'ముద్ర', రవితేజ 'అమర్ అక్బర్ ఆంథోనీ' వుండకపోవచ్చు. అవి రెండు డిసెంబర్ కు వెళ్లే అవకాశం వుంది. అలాగే వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర కూడా డిసెంబర్ లోనే. అందువల్ల నవంబర్, డిసెంబర్ లు పెద్దగా ఆసక్తిగా వుండే అవకాశం కనిపంచడం లేదు.

వీటన్నింటి మధ్య నవంబర్ లో కనుక రోబో 2 వస్తే మాత్రం సందడి వుంటుంది. లేదంటే లేదు. సో, ఈ దసరా సీజన్ తోనే 2018 టోటల్ ఇన్నింగ్స్ దాదాపుగా క్లోజ్ అయిపోతుందేమో? చూడాలి.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments