బాహుబలి రికార్డును అధిగమించిన 2.0!

హిందీలో డబ్బింగ్ సినిమాల విషయంలో బాహుబలి పార్ట్ వన్ సెట్ చేసిన లైఫ్ టైమ్ రికార్డును రజనీకాంత్ సినిమా 2.0 అధిగమించింది. బాహుబలి ది బిగినింగ్ సినిమా తన లాంగ్ రన్ లో మొత్తం 117 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ రికార్డును టూ పాయింట్ ఓ అధిగమించింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా బాహుబలి గ్రాస్ రికార్డును అధిగమించిందని హిందీ ట్రేడ్ పండితులు అంటున్నారు.

తద్వారా దక్షిణాది సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లలో ఈ సినిమా సత్తా చూపించింది. అయితే బాహుబలి టూ రికార్డు మాత్రం టూ పాయింట్ ఓ సినిమాకు అందేలా లేదు. బాహుబలి రెండోపార్టు హిందీ వెర్షన్ ఐదువందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ రికార్డుకు టూ పాయింట్ ఓ చాలా దూరంలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టూ పాయింట్ ఓ లాంగ్ రన్ లో హిందీలో రెండువందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆ మొత్తం దక్కినా ఈ సినిమా హిందీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు దక్కినట్టే అని అంటున్నారు.

అక్షయ్ కుమార్ కెరీర్లో లోటుగా ఉన్న రెండువందల కోట్ల రూపాయల ముచ్చటను టూ పాయింట్ ఓ భర్తీ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మధ్య అక్షయ్ వరసగా విజయాలను సొంతం చేసుకొంటూ వస్తున్నాడు.

ప్యాడ్ మన్, గోల్డ్ సినిమాలు డీసెంట్ వసూళ్లను సాధించాయి. టూ పాయింట్ ఓ రెండువందల కోట్లరూపాయల మార్కును దాటడం ద్వారా అక్షయ్ కు మరో హిట్ ను ఇస్తోందని అంటున్నారు.

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments