'2.0' కాగలదా బాహుబలి?

రజనీకాంత్‌, శంకర్‌ల '2.0' టీజర్‌ని చూడ్డానికి లక్షల మంది ఎగబడడంతోనే దీనిపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థమవుతోంది. మూడేళ్లుగా నిర్మాణంలో వున్న ఈ చిత్రానికి అయిదు వందల యాభై కోట్ల బడ్జెట్‌ అయిందని అంచనా. రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో గ్రాఫిక్స్‌ భారీ స్థాయిలో వుంటాయట.

టీజర్‌ని కంప్యూటర్లలో, మొబైల్స్‌లో చూసిన వారు మాత్రం గ్రాఫిక్స్‌ అంత గొప్పగా లేవని పెదవి విరుస్తున్నారు. 3డిలో థియేటర్లలో టీజర్‌ చూసిన వారు మాత్రం 'ఔరా' అంటూ మెచ్చుకుంటున్నారు. మరి '2.0'ని త్రీడీలోనే చూడాల్సి వస్తే ఇండియాలో ఎన్ని బెస్ట్‌ స్క్రీన్లు వున్నాయి? బాహుబలి చిత్రానికి 3డి హంగులు లేకుండానే అద్భుతాన్ని చూసిన అనుభూతి దక్కింది.

బాహుబలి ట్రెయిలర్‌ రిలీజ్‌ అయినపుడు ఇలాంటి మిక్స్‌డ్‌ టాక్‌ రాలేదు. ఫలానా టెక్నాలజీలోనే చూడాలనే ఫీలింగ్‌ అస్సలు లేదు. కానీ 2.0కి ఈ త్రీడీ ఎఫెక్ట్‌ ప్లస్‌ కంటే మైనస్‌ అయ్యేట్టుంది. త్రీడీలో చూసినా టూడీలో చూసినా కానీ అనుభూతిలో ఎలాంటి మార్పులు లేపోతేనే అడ్వాంటేజ్‌ వుంటుంది. టీజర్‌తో ఈ చిత్రానికి వున్న హైప్‌ ఏమిటనేది తెలిసినా కానీ ఈ మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ మాత్రం ఇబ్బంది పెట్టేదేనని చెప్పాలి.

Show comments