పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయినప్పుడు?

ప్రధానమంత్రి మోడీని విమర్శిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు.. ఒక్కోరోజు ఒక్కో కామెడీని తలపింపజేస్తున్నాయి. మోడీ విషయంలో బాబుకు ఇప్పుడు ఎన్నో గుర్తుకు వస్తున్నాయి. చోద్యం ఏమిటంటే.. అదే మోడీతో నాలుగేళ్ల పాటు అధికారాన్ని పంచుకున్నప్పుడు బాబుకు ఇవేవీ గుర్తుకురాలేదు. మోడీ మళ్లీ ప్రధాని కావాలని తీర్మానం పెట్టినప్పుడు కూడా ఇవేవీ గుర్తుకురాలేదు. ఇప్పుడే బాబుకు ఏవేవో గుర్తుకు వస్తున్నాయి.

మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారని.. అనేది చంద్రబాబు ఇప్పుడు మోపుతున్న అభియోగం. అయితే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దు అని, ప్రత్యేకహోదాతో అవసరం లేదని, ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలు బాగుపడిన దాఖలాలు లేవని, ప్రత్యేకహోదా అనే వాళ్లను జైల్లో పెడతామని..అన్నది మోడీ కాదు.చంద్రబాబే. మోడీ రాష్ట్రానికి బాగా సాయం చేస్తున్నారని, మిగతా రాష్ట్రాలకు మించి సాధించినట్టుగా చెప్పుకుంటూ.. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టింది ఏ బీజేపీ వాళ్లో కాదు..చంద్రబాబు నాయుడే!

అయితే ఇప్పుడు అవన్నీ తూఛ్ అంటూ.. కొత్త పల్లువులు అందుకుని, అదే పాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో పుల్వామా అటాక్ ను కూడా చంద్రబాబు వాడుకొంటూ ఉన్నారు. మోడీ వైఫల్యం వల్ల, అసమర్థత వల్ల ఇది జరిగిందని అంటున్నారు. ఈ ఘటనలో పాక్ కు క్లీన్ చిట్ కూడా ఇస్తున్నారు చంద్రబాబు.

ఒకవైపు ప్రపంచంలోని దేశాలన్నీ ఈ విషయంలో పాకిస్తాన్ ను తప్పుపడుతూ ఉన్నాయి. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం  కల్పిస్తూ ఉండటంతోనే ఈ పరిస్థితి అని అంటున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఈ ఘటనతో సంబంధం లేదని పాక్ ప్రకటించిందని అంటున్నారు. ఇలా పాక్ సమర్థకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు.

ఇక ఇక్కడ బాధ్యత, సమర్థత వంటి అంశాల గురించి బాబు మాట్లాడుతూ ఉన్నారు. వీటిప్రకారం మోడీ తక్షణం రాజీనామా చేయాలని అంటున్నారు. నిజమే. మోడీ రాజీనామా చేయాల్సిందే. ఒకవేళ పుష్కర తొక్కిసలాట సమయంలో.. జరిగిన ఘాతుకం విషయంలో అన్నీవేళ్లూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం వైపు చూపించాయి కదా, అప్పుడు గనుక బాబు రాజీనామా చేసి ఉంటే.. ఇప్పుడు మోడీ కచ్చితంగా బాధ్యత వహించాల్సింది.

నలభై నాలుగు మంది సైనికులు చనిపోయారు కాబట్టి బాధ్యత వహించాలని మోడీకి సవాలు విసురుతున్న చంద్రబాబుకు.. తన ఆధ్వర్యంలో జరిగిన పుష్కర స్నానాల్లో చనిపోయిన ఇరవై తొమ్మిది మంది గుర్తుకురావడం లేదేమో! 

రాయలసీమ రైతుల పుండుపై కారం

Show comments