సాక్ష్యంలో యాక్షన్ సీన్లు గ్రాఫిక్స్ కీలకం

సాక్ష్యం, 2018 సెకండాఫ్ ఆరంభంలో వసున్న క్రేజీ ప్రాజెక్ట్. సుమారు 42కోట్ల భారీ బడ్జెట్, పీటర్ హెయిన్స్ రూపొందించిన ఆరుఫైట్లు, సినిమాలో కీలకభాగాన్ని ఆక్రమించిన గ్రాపిక్స్. టాప్ హీరోల సినిమాలు ఓవర్ టేక్ చేసే యూరోస్ సంస్థ తీసుకోవడం, అన్నీకలిసి ఈ సినిమాకు మాంచి బజ్ ను తీసుకువచ్చాయి. ఈనెల 27న సాక్ష్యం థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చిట్ చాట్.

సాక్ష్యం ఎలాంటి సినిమా అనుకోవాలి?
ఇది టిపికల్ సినిమా. ఇప్పటివరకు ఇలాంటి సబ్జెక్ట్ తెరపైకిరాలేదు. మనిషికి జరిగిన అన్యాయానికి మనిషి పగ తీర్చుకోవడం వేరు. ఏ సాక్ష్యం లేదనుకుంటే, పంచభూతాలే సాక్ష్యంగా, అవే ప్రతీకారం తీర్చుకోవడంవేరు. ఇదంతా చాలా ఆసక్తికరంగా వుంటుంది. అందువల్ల ఇది పర్టిక్యులర్ జోనర్ సినిమా అనలేం. యూత్ కు నచ్చే లవ్ ట్రక్, యాక్షన్ సీన్లు వున్నాయి. అందరికీ నచ్చే విజువల్ వండర్స వున్నాయి. 
ఫ్యామిలీకి నచ్చే స్టోరీ వుంది. ఈ సినిమాలో నేను వీడియో గేమ్ డిజైనర్ గా కనిపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో వస్తున్న వీడియో గేమ్స్ ఎంతటి క్వాలిటీ గ్రాఫిక్స్ తో వుంటున్నాయో తెలిసిందే కదా. సినిమాలో అంతకు మించి వుంటాయి.

అసలు ఈ ప్రాజెక్టు మీకు ఎలా వచ్చింది?
జయజానకీనాయక ముందు దర్శకుడు శ్రీవాస్ ఓ లైన్ వుంది అన్నారు. జస్ట్ చెప్పారు. చాలా ఆసక్తికరం అనిపించింది. కథ మొత్తం వింటుంటే టైమ్ తెలియలేదు. వెంటనే ఓకె అన్నాం. అంతకన్నా కీలకం ఈ సినిమాకు సరైన నిర్మాత దొరకడం. నలభై కోట్లకు పైగా ప్రాజెక్ట్ ను తీయడం అంటే అందరివల్లా అయ్యేది కాదు.

పంచభూతాలు, ఆ కాన్సెప్ట్ యాక్సెప్ట్ గా వుంటాయా?
దర్శకుడు శ్రీవాస్ చాలా క్లియర్ అండ్ క్లెవర్ స్క్రిప్ట్ తయారుచేసారు. అంతా మైమరచి చూసేలా వుంటుంది తప్ప, పజిల్ లాగ ఏమీ వుండదు. ఇప్పటికే పంచభూతాల మీద రాసిన సాంగ్ ఎంత హిట్ అయియిందన్నది మీకు తెలిసిందే.

వరుసగా భారీ సినిమాలే చేస్తారా ఇకమీద కూడా?
అదేంలేదు మధ్యలో ఓ చిన్న సినిమా ట్రయ్ చేసా, నాకు సూటబుల్ కాదనిపించింది. నాకు సూటయ్యే ఏ సినిమా అయినా చేస్తాను. అయితే సినిమా సినిమాకు వేరియేషన్ వుండేలా చూసుకుంటాను. వచ్చే రెండు సినిమాలు కూడా అలాంటివే. అసలు ఆ ప్రాజెక్టులు చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది నేను వైవిధ్యం కోసం ప్రయత్నిస్తున్నాను. అదికాక ఇవ్వాళ మార్కెట్ మరీ చిన్న సినిమాలు అంటే ఎక్కడో పదింట ఒకదానికి ఓటేస్తున్నారు. అంతకు మించి అన్నట్లుగా వుంది ప్రేక్షకుల ధోరణి. వాళ్లకు కావాల్సినవి ఇవ్వాలి అంటే దాని తగ్గట్లు బడ్జెట్, కథ, కథనం వుండాలి.

మీ సక్సెస్, ప్లానింగ్ అంతా మీ ఫాదర్ దేనా?
కాదని ఎలా అంటాను. నా వరకు సినిమాను ఎంత బాగా చేయగలిగాను? దర్శకుడు చెప్పిన దాంట్లో, డ్యాన్స్ డైరక్టర్ చేసిన దాంట్లో, ఫైట్ మాస్టర్ చూపించిన దాంట్లో ఏమేరకు చేయగలిగాను అన్నదే. కానీ ప్రాజెక్ట్ మార్కెటింగ్, ప్లానింగ్ లు అన్నీ నా అనుభవానికి సరిపోయేవి కావు. నిర్మాతలు, డాడీ సహకారంతో జరిగేవే. అది నా అదృష్టం అనుకోవాలి.

హల్క్ బాడీ ప్రజెంటేషన్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు కూడా చేసే అవకాశం వుందా?
ఎందుకు లేదు, ప్రతి సినిమాలో లవ్ ట్రాక్ వుంటుంది. అయితే పూర్తిగా లవ్ జోనర్ లో కూడా సినిమా చేయబోతున్నాను. అది మీకు త్వరలో తెలుస్తుంది. అయితే యాక్షన్ ఎపిసోడ్ లు అన్నవి నా నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల అవి కామన్ గా వుంటాయి.

సాక్ష్యం ఫలితం విషయంలో ఏమైనా టెన్షన్ వుందా?
అస్సలు లేదు. ఎందుకంటే ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో మా యూనిట్ అందరికీ తెలుసు. అయితే ప్రతి సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అన్న చిన్న క్యూరియాసిటీతో కూడా టెన్షన్ వుంటుంది. అది నాకే కాదు, ఏ హీరోకి అయినా కామన్.

థాంక్యూ.. థాంక్యూ

Show comments