2019లో ఏ పార్టీకి ప్రచారం చేయను-మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాను కలిసారు. భరత్ అనే నేను సినిమా విడుదల ముందు అదో ఫార్మాలిటీ కాబట్టి, ఓ ఇరవై నిమషాలు ఆ మొక్కుబడి తీర్చుకున్నారు. అదెలా సాగింది అంటే..

వెకేషన్ కు వెళ్లి వచ్చినట్లున్నారు

అవునండీ ఎప్పుడూ సినిమా తరువాత వెళ్తాను. ఇప్పుడు ముందుగా వెళ్లాను. సినిమాకు అన్ని విధాలా పాజిటవ్ వైబ్ వుంది. అందుకే వెళ్లాను.

రాజకీయాలు కిట్టని మీరు పొలిటికల్ సినిమా చేయడం?

అది మీరు శివగారిని అడగాలండి. క్రెడిట్ అంతా ఆయనదే.

పొలిటికల్ సినిమా కోసం ఏమైనా హోమ్ వర్క్ చేసారా?

లేదండీ. అంతా శివగారే చూసుకున్నారు. నిజానికి ఈ తరహా భాష, లెంగ్తీ డైలాగులు అన్నీ నాకు కొత్తే. అయితే మా బావ జయదేవ్ పార్లమెంట్ లో మాట్లాడిన వీడియోలు ఒకటి రెండు మాత్రం చూసాను.

నాన్నగారు ముఖ్యమంత్రిగా చేసినవి చూసారా?

నాన్నగారి సినిమాలు అన్నీ చూస్తానండీ. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ చూడలేదు.

ప్రామిస్ నిలబెట్టుకోవడం అన్న పాయింట్ మీదనే సినిమా మొత్తం వుంటుందా?

అవునండీ. అయితే అందులో పార్ట్ గానే చాలా వుంటాయి.

వేరే సినిమాలు పెద్ద హిట్ అయి, మీకు ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసిన తరువాత, ఆ టెన్షన్ ఏమయినా వుంటుందా?

అబ్బే అలాంటిది ఏమీ లేదండీ. ఏ సినిమాకు ఆ సినిమానే.

బ్రహ్మోత్సవం, స్పైడర్ వైఫల్యాల మీద పోస్ట్ మార్టమ్ ఏమైనా చేసారా?

లేదండీ. అస్సలు అలాంటివి చేయను.

భరత్ లో కమర్షియల్ ఎలిమెంట్ ఏమిటి?

శివగారు కమర్షియల్ గా ఆలోచిస్తూనే అండర్ కరెంట్ గా మెసేజ్ ఇస్తారు. అందువల్ల సినిమా కమర్షియల్ నే.

ఈ రోజుల్లో జనాలు హిత వచనాలు వినే పరిస్థితుల్లో వున్నారంటారా?

వింటారనే అనుకుందాం. రెండు రోజులే వుంది కదా. చూద్దాం

సినిమా సక్సెస్ ను సోషల్ మీడియా ఏ మేరకు ప్రభావితం చేస్తోంది?

చాలా. ఒకప్పుడు పత్రికల్లో వచ్చేవి సోషల్ మీడియాలో వచ్చేవి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నవి పత్రికల్లో వస్తున్నాయి. సోషల్ మీడియాలో సినిమాను ప్రమోట్ చేయడం అన్నది కూడా కీలకంగా మారింది.

అందరు హీరోలు కొత్త కొత్త గెటప్ లు ట్రయ్ చేస్తున్నారు. మేకోవర్ అంటున్నారు. మరి మీరు?

మీరు అడిగారు కదా? ట్రయ్ చేస్తాలెండి

వంశీ పైడిపల్లి సినిమా?

జూన్ నుంచి వుంటుంది.

ఆ సినిమా మీద కోర్టు వివాదాలు వున్నాయేమో?

తీరిపోయి వుంటాయి. లేకపోతే స్టార్ట్ చేయరు కదా?

స్టే వుందని..?

వుందా? 

14మందికి నోటీసులు ఇచ్చారని?

అవునా.. మీకు నెంబర్ కూడా 14అని కరెక్ట్ గా తెలుసే.

త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు?

వుంటుంది.

సుకుమార్ తో, వంగా సందీప్ రెడ్డి?

అందరితోనూ వుంటాయి.

త్రివిక్రమ్ సినిమా నెంబర్?

తెలియదు. ఏ స్క్రిప్ట్ వస్తే అదే.

మీకు నచ్చిన సిఎమ్ ఎవరు?

ఇప్పుడు ఈ టైమ్ లో ఈ కాంట్రావర్సీ అవసరమా?

2019ఎన్నికల్లో మీ పాత్ర ఏమైనా, ఏ రూపంలోనైనా వుంటుందా?

వుండదు. నేను ఆ టైమ్ లో విదేశాల్లో వుంటాను. 

20ఏప్రియల్ మీ అమ్మగారి పుట్టిన రోజు

అవును. మంజుల చెప్పింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతకన్నా మంచి రోజు ఏముంటుంది?

20ఏప్రియల్ చంద్రబాబు నాయుడు గారి బర్త్ డే కూడా

అవునా.. అయితే ఇంకా హ్యాపీ

ఇదీ మహేష్ బాబు మీడియా ముచ్చట్లు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

Show comments