ఈవారం ట్రేడ్‌ టాక్‌

దసరా సినిమాల్లో 'మహానుభావుడు' క్లీన్‌ హిట్‌ అనిపించుకుంది. ఈ చిత్రానికి తొలి వారంలో బ్రహ్మాండమైన వసూళ్లు వచ్చాయి. 32కోట్ల గ్రాస్‌ కలక్షన్లు రాబట్టి శర్వానంద్‌ సినిమాల్లో తొలి వారంలో టాప్‌ గ్రాసర్‌గా నిలిచింది. రెండు భారీ చిత్రాలతో పోటీగా వచ్చినా కానీ మహానుభావుడు చిత్రానికి మొదటి రోజు నుంచి ఆదరణ బాగుంది.

భలే భలే మగాడివోయ్‌ తరహా వినోదాన్ని మారుతి అందించడంతో ఈ చిత్రానికి ఫ్యామిలీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈవారం చెప్పుకోతగ్గ సినిమా ఒకటీ లేదు కనుక మహానుభావుడు మరింత పెద్ద రేంజ్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జై లవకుశ చిత్రం దసరా వారాంతాన్ని కూడా బాగానే క్యాష్‌ చేసుకుంది. ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ చేరుకోలేదు కానీ భారీ నష్టాలు రావని మాత్రం తేలిపోయింది.

స్పైడర్‌ మాత్రం డిజాస్టర్‌ దిశగా సాగుతోంది. ఫస్ట్‌ వీక్‌లో అండర్‌ పర్‌ఫార్మ్‌ చేసిన ఈ చిత్రం వసూళ్లు అంతటా గణనీయంగా పడిపోయాయి. ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం పోవడం ఖాయమని ట్రేడ్‌ చెబుతోంది. బ్రహ్మూత్సవం తర్వాత మహేష్‌కి ఇది మరో భారీ షాక్‌.

Show comments