ప్రేక్షకులను మనమే తక్కువ అంచనా వేస్తున్నాం

హను రాఘవపూడి. ఇప్పటి దాకా చేసినవి రెండే సినిమాలు. కానీ వైవిధ్యమైన సినిమాలు చేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ముచ్చటగా మూడో సినిమాగా లై అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో చిన్న చిట్ చాట్.

లై గురించి నిజం చెప్పండి, ఇది ఏ జోనర్ సినిమా. యాక్షన్ డ్రామానా? రివెంజ్ డ్రామానా? మైండ్ గేమ్ నా?

వాస్తవంగా చెప్పాలంటే మంచి ప్రేమకథ. అందులో మైండ్ గేమ్ కూడా వుంటుంది. సాధారణంగా మన కథల్లో హీరో హీరోయిన్ల జీవితంలోకి విలన్ ఎంటర్ అవుతూ వుంటాడు. ఇక్కడ విలన్ జీవితంలోకే హీరో, హీరోయిన్లు ఎంటర్ అవుతారు. అసలు సినిమా ప్రారంభం కావడమే విలన్ పెర్ స్పెక్టివ్ లో స్టార్ట్ అవుతుంది.

ఇప్పటికి చేసినవి రెండూ ప్రేమ కథలే. కానీ ఈసారి హను పెద్ద సినిమాలు కూడా హ్యాండిల్ చేయగలడు అని అనిపించుకోవాలని ఈ స్టయిల్ లోకి వచ్చారా?

అబ్బే అదేం లేదండీ. నాకు నచ్చిన కథ, నాకు వచ్చిన పరిథిలోనే, చెప్పాలన్న ప్రయత్నం. ఎటొచ్చీ కొత్త మేకింగ్ స్టయిల్ ను, కొత్త లోకేషన్లను తీసుకోవడం వల్ల కాస్త డిఫరెంట్ గా అనిపిస్తోంది.

70 రోజులు అమెరికాలో షూట్ చేసారు. అక్కడే చేయాల్సిన కథనా ఇది?

కచ్చితంగా.. ఇది అక్కడి కోసమే తయారుచేసుకున్న కథ. అయితే 70 రోజులు, మంచి లొకేషన్లు అన్నవి నిర్మాత అనిల్ అభిరుచి వల్ల. ఆయన ఏరి కోరి మంచి లోకేషన్లు చూపించి మరీ షూట్ చేయించారు.

మీ నెరేషన్ స్టయిల్ కాస్త టిపికల్ గా వుంటుందని, కామన్ ఆడియన్ అంత సులువగా కనెక్ట్ కావడం కష్టమని చిన్న విమర్శ వుంది కదా?

టిపికల్ అని కాదండీ. అది నా అభిరుచి, నా స్టయిల్. ఇక కామన్ ఆడియన్ అన్నది మనం తయారుచేసిన పదం. ఇవ్వాళ ఆడియన్స్ పూర్తిగా అప్ డేట్ అవుతున్నారు. ఒకప్పుడు ఒక్క రోజు కూడా ఆడదు అనుకునే జోనర్ ను ఇప్పుడు ఆడిస్తున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు మరి కాస్త ఎక్కువ కోరుకుంటున్నారు. కానీ మనమే ధైర్యం చేయడం లేదు. చేస్తే, ఒకె అనడానికి వాళ్లు ఎప్పుడూ రెడీనే.

లై సినిమా మేకింగ్ లో హై స్టాండర్ట్ కనిపిస్తోంది. సినిమా సబ్జెక్ట్ కూడా అలాగే వుంటుందా?

కచ్చితంగా డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పటి దాకా అటెంప్ట్ చేయనిదే. ఇక హై స్టాండర్డ్ అంటే థాంక్స్ టు అనిల్ సుంకర్ అండ్ యువరాజ్. అనిల్ గారు అమెరికా వాసి అవ్వడం వల్ల ఇప్పటి వరకు షూట్ చేయని లొకేషన్లకు తీసుకెళ్లారు. ఇక యువరాజ్ హాలీవుడ్ సినిమాల లుక్ తీసుకోచ్చాడు. అదీ ప్లస్ పాయింట్ నాకు.

నితిన్ మార్కెట్ కు మించి ఖర్చు చేయించినట్లు అనిపించలేదా?

కచ్చితంగా లేదు. నితిన్ మార్కెట్ లిమిట్స్ లోని సినిమాకు ఖర్చయింది. పైగా నేను నాచురల్ లోకేషన్లలోనే షూట్ చేస్తాను. అందువల్ల సెట్ లకు అయ్యే ఖర్చంతా ఆదా. 

తరువాత సినిమాలకు రెడీ అయిపోతున్నారా?

నానితో ఓ సినిమా కమిట్ అయ్యాను. అది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. లడఖ్ ప్రాంతంలో షూట్ చేయాలి. పర్మిషన్లు అవీ రావాలి. ఈ లోగా మరో సినిమా చేస్తానేమో? ఆలోచన అయితే వుంది.

Show comments