వైసీపీ వాళ్ల ఇంట్లో గొడ‌వ‌లున్నాయా.. టీడీపీ ప్యాకేజ్!

ఈ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థుల ఇంటి వ్య‌వహారాల‌పై తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ వ‌ల విసురుతోంది! మామ‌పై అల్లుడికి కోపం ఉందా, తండ్రిపై కూతురికి కోపం ఉందా, త‌మ తండ్రి సంపాదించ‌లేద‌ని వారిలో ఆవేధ‌న ఉందా, లేక సంపాదించినా త‌మ‌కు ద‌క్క‌నీయ‌డం లేద‌నే బాధ ఉన్నా.. ఇలాంటి అసంతృప్తితో ఉండి, తెలుగుదేశం పార్టీని క‌న్స‌ల్ట్ అయితే చాలు భారీగా ప్యాకేజీ ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది!

ఎన్నిక‌ల స‌మ‌యాల్లో తెలుగుదేశం పార్టీ సామ‌దాన‌బేద‌దండోపాయాల‌న్నింటినీ వాడుకోవ‌డం కొత్త కాదు! ఇప్పుడూ అదే జ‌రుగుతూ ఉంది. అంబ‌టి అల్లుడి విష‌యంలో అయినా, ముద్ర‌గ‌డ కూతురు విష‌యంలో అయినా.. తెలుగుదేశం ప్యాకేజీలు బ‌లంగా ప‌ని చేశాయ‌నే టాక్ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధి నుంచి వినిపిస్తూ ఉంది!

అయితే ఈ ప్యాకేజీలు అంబ‌టి, ముద్ర‌గ‌డ‌ల ఇళ్లకే కాదు.. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న వారెవ‌రి విష‌యంలో అయినా వ‌ర్తిస్తాయ‌ని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన వారి ఇళ్ల‌లోని వారు ఎవ‌రైనా అసంతృప్తితో తెలుగుదేశం పార్టీ వారిని క‌న్స‌ల్ట్ అయితే చాలు, ఆ త‌ర్వాత సంగ‌తిని వారు చూసుకుంటున్నార‌ని స‌మాచారం!

భారీ ప్యాకేజీ ఖాయం.. జ‌స్ట్ త‌మ వారిని తిడుతూ, వారిని ఓడించాల‌ని అంటే చాలు, తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా సొమ్ములు ద‌క్కే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంట్లో వారిపై ఎదురుతిరిగిన వారికి ఇదే ద‌క్కింద‌ని తెలుస్తోంది. మ‌రి తెలుగుదేశం పార్టీ గేలానికి ఇంకా ఇలాంటి చేప‌లు ఎన్ని దొరుకుతాయో! స‌మ‌యం మించిపోతోంది!