మళ్లీ డీప్ ఫేక్ బారిన పడిన హీరోయిన్

ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల గోల ఎక్కువైంది. ఏది నిజమే, ఏది నకిలీదో కనిబెట్టడం యమకష్టంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది హీరోలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. నటి అలియా భట్ మరోసారి దీని బారిన పడింది.

ప్రస్తుతం నెట్ లో అలియా భట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందమైన డ్రెస్సులో అలియా భట్ కవ్విస్తోంది. అందులో అశ్లీలత ఏం లేదు కానీ ఆ వీడియో అలియాభట్ ది కాదు. నటి వామికా గాబికి చెందిన వీడియోకు ఏఐ సహాయంతో అలియాభట్ ముఖాన్ని తగిలించారు.

చూడ్డానికి ఒరిజినల్ గా అనిపిస్తున్న ఈ వీడియో, నిజానికి నకిలీది. దీన్ని నెటిజన్లు ఈజీగానే గుర్తుపట్టగలిగారు. ఎందుకంటే, జస్ట్ 2 రోజుల కిందటే వామికా ఈ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోనే కొంతమంది ఇలా డీప్ ఫేక్ చేశారు.

అంతకంటే ముందు బెడ్ పై ఎక్స్ పోజింగ్ చేస్తూ ఓ బ్రాండ్ గురించి కవ్విస్తూ చెప్పే అలియా వీడియో ఒకటి వైరల్ అయింది. ఇది కూడా డీప్ ఫేక్ వీడియోనే. వైరల్ అయిన కొన్ని గంటలకే అది ఇంటర్నెట్ నుంచి మాయమైంది.

రష్మిక, కాజోల్, ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్.. ఇలా చాలామంది హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓవైపు కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోల చలామణి ఆగకపోవడం బాధాకరం.