ఒక కమెడియన్ కు మరొక కమెడియన్ తోడు

ప్రస్తుత రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు పెద్ద కమెడియన్ ఎవరా అని చెప్పుకోవాల్సి వస్తే ముందు వరుసలో రఘురామకృష్ణ రాజు కూడా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తానని అంటూ నిత్య ప్రగల్భాలు పలికే వారిలో ఆయన అగ్రగణ్యులు. అలాంటి అతిపెద్ద కమెడియన్ రఘురామకృష్ణరాజు, మరొక సినిమా కమెడియన్ పృద్విని వెంటపెట్టుకొని జగన్ మీద నిందలు వేయడం, బురద చల్లడం, చంద్రబాబు ట్యూన్లకు తగినట్టు పాటపాడడం..  ఇప్పుడు చూసిన వారందరికీ పెద్ద ప్రహసనంగా కనిపిస్తున్నది.

సినిమా కమెడియన్ పృథ్వి అంటే ప్రజల్లో ఏమాత్రం విలువ ఉన్నదో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ఆయన చేసినదేమీ లేకపోయినప్పటికీ, ఆ పార్టీ కార్యకర్తగా తనని నమ్ముకుని ఉన్నందుకు.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా ఒక అపురూపమైన పదవిని చవకబారు కమెడియన్ పృథ్వీకి కట్టబెట్టారు జగన్! కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా పృథ్వి ఎంత చవకబారుగా, లేకిగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. టీటీడీలోని మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉండి నీచంగా వ్యవహరించారు నటుడు పృథ్వి.

ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలి వేసింది. మరెక్కడా గతిలేని పృథ్వి జనసేన పంచన చేరారు. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి మీద అర్థం పర్థం లేని నైతిక విలువలు లేని విమర్శలతో చెలరేగుతూ వస్తున్నారు. ప్రజలలో అంత అసహ్యమైన క్రెడిబిలిటీ ఉన్న పృథ్వీతో కలిసి రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ నిర్వహించడం ఆ ప్రెస్ మీట్ లో జగన్ మీద నిందలు వేయడం, ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది ఒక కమెడియన్ మరొక కమెడియన్ తో కలిసి భలే కామెడీ ఎపిసోడ్ రక్తి కట్టిస్తున్నారని జనం నవ్వుకుంటున్నారు.

రఘురామక్రిష్ణ రాజు ప్రస్తుతం ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీచేస్తున్నారు. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అక్కడ గెలుస్తారో లేదో తెలియకుండా కాలం గడుపుతున్నారు. కాగా.. జనసేనలో ఉన్నప్పటికీ.. కనీసం పవన్ కల్యాణ్ కూడా స్టార్ క్యాంపెయినర్ గా పృథ్వీ పేరును ప్రకటించలేదు.

చివరికి జబర్దస్త్ టీంలోని హైపర్ ఆది కంటే పృథ్వి బతుకు చీప్ అయిపోయింది... పవన్ కల్యాణ్ దృష్టిలో! అలాంటి మార్కెట్ లేని కమెడియన్ ని వెంటపెట్టుకుని రఘురామ నిందలు వేస్తున్నారు. వీరిద్దరూ కలిసి లాండ్ టైటిలింగ్ చట్టం గురించి చెబుతున్నారు. జగన్ మన భూములు కాజేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి మాటలు చూసి జనం నవ్వుకోక మరేం చేయగలరు?