వేటగాడు ఎంట్రీ.. మూవీలో మరింత మసాలా

బాలయ్య సినిమాకు మరో ఎట్రాక్షన్ వచ్చి చేరింది. కొన్ని రోజులుగా మార్కెట్లో వినిపిస్తున్న ఊహాగానాల్ని నిజం చేస్తూ, బాలయ్య మూవీలోకి బాబీ డియోల్ వచ్చి చేరాడు. బాలయ్య సినిమా సెట్స్ పైకి బాబీ డియోల్ వచ్చి చేరిన విషయాన్ని యూనిట్ నిర్థారించింది. అతడితో దిగిన ఫొటోని షేర్ చేశాడు దర్శకుడు బాబి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది బాలయ్య-బాబి సినిమా. కెరీల్ లో బాలకృష్ణకు ఇది 109వ సినిమా. దీనికి సంబంధించి టైటిల్ ఇంకా చెప్పనప్పటికీ, గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు. శివరాత్రికి విడుదల చేసిన ఆ వీడియో బాగా వైరల్ అయింది.

ఇప్పుడు బాబీ డియోల్ రాకతో ఈ సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం బాలయ్య ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో బాబీ డియోల్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారు. యానిమల్ సినిమాతో బాబీడియోల్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

తెలుగులో ఇతడికిది రెండో సినిమా. ముందుగా అతడు హరిహర వీరమల్లు సినిమాలో నటించడానికి అంగీకరించాడు. పవన్ అందుబాటులో లేకపోవడంతో ఆ సినిమా చాన్నాళ్లుగా ఆగిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, బాలయ్య సినిమాతో ముందుగా తెలుగుతెరపైకి రాబోతున్నాడు బాబి.